Social 1080×1350 • Multi-page
11-02-2025 BREAKING NEWS 11:05 PM
swarnodayam.com
Telugu Daily News

శేఖర్ అన్న కోసం మేము సైతం అంటూ ప్రచారం నిర్వహించిన హుజురాబాద్ ట్రస్మా సభ్యులు

శేఖర్ అన్న కోసం మేము సైతం అంటూ ప్రచారం నిర్వహించిన హుజురాబాద్ ట్రస్మా సభ్యులు
IMG_20250212_190450

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈరోజు బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ట్రస్మా బలపరిచిన అభ్యర్థి యాదగిరి శేఖర్ రావుకు మద్దతు తెలపాలని కోరుతూ ట్రస్మా ప్రైవేట్ పాఠశాలల యజమానులు పట్టభద్రులను కలుస్తూ మద్దతు కోరడం జరిగింది. పట్టభద్రుల సమస్యలు తెలిసిన వాడిగా పట్టభద్రుల కోసం కష్టపడే శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకుడు యాదగిరి శేఖర్ రావు అని అలాంటి వారిని గెలిపించుకుంటే ఇటు పట్టభద్రులు అటు ప్రజలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తామని పేర్కోన్నారు. పట్టభద్రుల అభివృద్ధి కోసమే ఈరోజు ఎమ్మెల్సీగా వస్తున్నారని ఒక్కసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకునే బాధ్యత పట్టభద్రుల పైన ఉందని పదవి కోసం జీతం కోసమో రావడంలేదని తనకు వచ్చే జీతం మొత్తం ప్రతినెల ఒక మండలనికి ఖర్చు చేస్తానని బహిరంగంగా ప్రకటించిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే తనే మా యాదగిరి శేఖర్ రావు అని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ట్రస్మా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు ట్రస్మా బాధ్యులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!