Social 1080×1350 • Multi-page
14-02-2025 BREAKING NEWS 04:22 PM
swarnodayam.com
Telugu Daily News

ఆల్ ఇండియా “సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్” కి సహకార శాఖ ఉద్యోగి మాటూరి రాజేష్ ఎంపిక.

ఆల్ ఇండియా “సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్” కి సహకార శాఖ ఉద్యోగి మాటూరి రాజేష్ ఎంపిక.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సహకార శాఖ ములుగు జిల్లాలో “సీనియర్ ఇన్స్పెక్టర్”గా విధులు నిర్వహిస్తున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ వాసి మాటూరి రాజేష్ ఈనెల 15వ తేదీ నుండి 28వ తేదీ వరకు కాకినాడలో జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ కు ఎంపికైనట్టుగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈయన బెంగళూరు, కురుక్షేత్ర, చండీగఢ్, రాంచి, రాయపూర్, భోపాల్, భువనేశ్వర్ లో నిర్వహించిన హాకీ టోర్నమెంట్ లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి పలువురి ప్రశంసలు పొందినారు. మాటూరి రాజేష్ ఎన్నిక పట్ల ములుగు జిల్లా సహకార అధికారి సర్దార్ సింగ్ మాలోత్, సహకార శాఖ సిబ్బంది, హుజురాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, సెక్రటరీ జీ ఉమామహేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, తోట రాజేంద్రప్రసాద్, గుడ్డెలుగుల సమ్మయ్య, చింత శ్రీనివాస్, భూసారపు శంకర్, శ్రీనివాసు, రవికుమార్, యూసుఫ్, సజ్జు, బండ రఘు, సురేష్, శ్యామ్, బిక్షపతి, తిరుపతి, కుమార్, సాయికృష్ణ, ప్రదీప్, రాజేషు, విక్రం, సాంబ, వినయ్, వేణు, స్నేహితులు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!