14-02-2025 NORMAL NEWS 11:15 PM
swarnodayam.com
Telugu Daily News
14-02-2025 11:15 PM By Mandala Yadagiri

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకం

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకం
IMG-20250214-WA0059

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా ఉన్న దీపాదాస్ మున్షిపై వేటు పడింది. ఆమె పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డితో పాటూ ముఖ్యనేతలు అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలకు బలం చేకూరుస్తూ ఆమెను పదవి నుంచి తప్పించారు..దీపాదాస్ మున్షి స్థానంలో మరో మహిళా నేత మీనాక్షి నటరాజన్‌ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్వర్వులు జారీ చేసింది..కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్‌లో దీపదాస్ మున్షీని తెలంగాణకు ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు.

మీనాక్షి నటరాజన్ విషయానికి వస్తే… ప్రస్తుతం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ బృందంలో కీలకంగా ఉన్నారు. మీనాక్షి నటరాజన్ తన రాజకీయ జీవితాన్ని మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐతో ప్రారంభించారు. ఆమెను కాంగ్రెస్ నాయకత్వం.. 2008లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2009 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ఆమెను మందసౌర్ నుంచి పోటీకి దింపింది. అక్కడ ఆమె విజయం సాధించారు. అయితే ఆ తర్వాత మీనాక్షి నటరాజన్.. వరుసగా 2014, 2019 లోక్‌సభ ఎన్నికలలో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!