Social 1080×1350 • Multi-page
20-02-2025 BREAKING NEWS 05:55 PM
swarnodayam.com
Telugu Daily News

నిజాయితీపరుడు, సేవా తత్పరుడు ప్రసన్నా హరికృష్ణకు అండగా నిలవండి… జమ్మికుంటలో విస్తృత ప్రచారం చేసిన అభిమానులు

నిజాయితీపరుడు, సేవా తత్పరుడు ప్రసన్నా హరికృష్ణకు అండగా నిలవండి… జమ్మికుంటలో విస్తృత ప్రచారం చేసిన అభిమానులు
IMG_20250220_175055

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: నిజాయితీపరుడు, సేవా తత్పరుడు ప్రసన్నా హరికృష్ణకు అండగా నిలవండి… జమ్మికుంటలో గొడిశాల రమేష్ డివిజన్ ఇంచర్చ్ అధ్వర్యంలో ఎర్ర శ్రీధర్, గదేపాక కుమార్ రాజా, మిడిదొడ్డి విజయ్, అంతడుపుల శ్రీనివాస్, మిదిదొడ్డి రమేశ్, మాచర్ల శ్రీనివాస్, ప్రశాంత్, ప్రవీణ్, జమ్మికుంటలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ప్రసన్న హరికృష్ణ ఎమ్మెల్సీగా గెలిస్తే ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో ముందుగానే ప్రణాళికాబద్ధంగా రూపొందించిన కరపత్రాన్ని పట్టభద్రులకు, ఉద్యోగ ఓటర్లకు పంచుతూ ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలుపాలని కోరారు. 19 ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రాజీనామా చేసి ప్రజాసేవకు అంకితమై రూపాయికే ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనలో చేదోడువాదోడుగా అండగా నిలిచారన్నారు. కొందరు విద్యా వ్యాపారంగా భావించే వారికి బుద్ధి చెప్పాలంటే నీతి నిజాయితీతో ప్రజాసేవ చేసేందుకు ఎమ్మెల్సీగా ముందుకు వచ్చిన ప్రసన్న హరికృష్ణకు మద్దతు తెలిపాలని వారు కోరారు. జమ్మికుంట పట్టణంలోని వాకర్స్ మైదానం వద్ద జిమ్ ల వద్ద, వ్యాపార కూడలిల వద్ద నిరుద్యోగులను, పట్టభద్రులను కలిసి ఓటు అభ్యర్థించారు. కాగా వారి ప్రచారానికి ఉద్యోగులు, నిరుద్యోగులు, పట్టభద్రుల నుండి విశేష స్పందన లభించడం కోసమెరుపు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072 జమ్మికుంట పట్టణంలో ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న ఆయన అభిమానులు, పట్టభద్రుడు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!