22-02-2025 NORMAL NEWS 02:32 PM
swarnodayam.com
Telugu Daily News
22-02-2025 02:32 PM By Mandala Yadagiri

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్పోర్ట్స్ యూనిఫామ్ వితరణ

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్పోర్ట్స్ యూనిఫామ్ వితరణ
IMG_20250222_143003

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సైదాపూర్ మండలంలోని ఎలాబోతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని 24 మంది విద్యార్ధినీ విద్యార్థులకు శనివారం రోజున స్పోర్ట్స్ యూనిఫామ్ వితరణ చేశారు. హుజురాబాద్ లోని కాకతీయ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మారబోయిన వేణుమాధవ్ తన అమ్మ, నాన్న మారబోయిన లక్ష్మీ – మల్లయ్యల జ్ఞాపాకార్థం వితరణ చేసారని తెలిపారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ కు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు మల్గారెడ్డి జ్యోతిరాణి, ఉపాధ్యాయుడు నాగిరెడ్డి శ్రీనివాసారావు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Oplus_131072 విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు అందజేస్తున్న దాత వేణుమాధవ్
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!