23-02-2025 NORMAL NEWS 05:47 PM
swarnodayam.com
Telugu Daily News
23-02-2025 05:47 PM By Mandala Yadagiri

ఘనంగా మహా కుంభాభిషేకం.. -సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరు.

ఘనంగా మహా కుంభాభిషేకం.. -సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరు.
Oplus_131072

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరయ్యారు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం దంపతులు పంచకుండాత్మక మహా పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం వారు అంతరాలయం మాడవీధుల్లోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, వామనామలై పీఠాధిపతి సూచనల మేరకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వర్ణమయ పంచతల విమానగోపురం వద్ద ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. మహాకుంభాభిషేకం, సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు, అధికారులు, ప్రజాప్రతినిధుల మధ్య భక్తి శ్రద్ధలతో కూడిన వాతావరణం నెలకొంది. భక్తులు భారీగా తరలిరావడంతో ఈ మహా కుంభాభిషేకం కార్యక్రమం యాదాద్రి ఆలయ మహిమను మరింత పెంచనుంది.

Oplus_131072మహా కుంభాభిషేకం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!