24-02-2025 NORMAL NEWS 12:43 PM
swarnodayam.com
Telugu Daily News
24-02-2025 12:43 PM By Mandala Yadagiri

హుజురాబాద్ లో దొంగల బీభత్సం…ఇంట్లోకి చొరబడి ముగ్గురిని బంధించి, గాయపరిచి, 70 తులాల బంగారం, 7 లక్షల నగదు చోరీ… – సందర్శించి విచారణ జరిపిన టౌన్ సిఐ, డాగ్ స్క్వాడ్ బృందం. ఇది తెలిసిన వారిపనేనా అని అనుమానం!?

హుజురాబాద్ లో దొంగల బీభత్సం…ఇంట్లోకి చొరబడి ముగ్గురిని బంధించి, గాయపరిచి, 70 తులాల బంగారం, 7 లక్షల నగదు చోరీ… – సందర్శించి విచారణ జరిపిన టౌన్ సిఐ, డాగ్ స్క్వాడ్ బృందం. ఇది తెలిసిన వారిపనేనా అని అనుమానం!?
IMG_20250224_123648

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ పట్టణంలో భారీ చోరీ జరిగింది. ప్రతాపవాడకు చెందిన ప్రతాప రాఘవరెడ్డి (సత్యనారాయణ స్వీట్ హౌస్ ఓనర్) ఇంట్లోకి ఆదివారం రాత్రి సుమారు 11:30 గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న రాఘవరెడ్డి, అతని భార్య వినోదపై దాడి చేశారు. వారి కూతురు మానస మెడపై కత్తులు పెట్టి బెదిరించి ఇంట్లో ఉన్న 70 తులాల బంగారు ఆభరణాలు, రూ.7 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుల చరవాణిలను తీసుకెళ్లి బయటపడేశారు. విషయం తెలుసుకొని వచ్చిన రాఘవరెడ్డి కుటుంబీకులు వచ్చి గాయపడ్డ ఇద్దరిని చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ తిరుమల్ గౌడ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వేలి ముద్రల నిపుణులు, డ్వాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. కుటుంబ సభ్యుల మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

“రాత్రి 11:30 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. కత్తి మెడపై పెట్టి బెదిరించారు. టవల్తో నోరు, కాళ్లు కట్టేసి దాడి చేస్తూ డబ్బులు ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలన్నారు. ఇంట్లో 70 తులల బంగారం, రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. అలాగే అదే ఇంటి పైన ఉండే అతని కొడుకు నాగరాజు, కోడలు ఇంట్లోకి చొర బడేందుకు ప్రయత్నించగా పైన ఎవరూ లేరు అంతలా అయితే వెళ్లి చూడండి అనేసరికి దొంగలు పైకి వెళ్లలేదని బాధితుడు రాఘవరెడ్డి తెలిపారు. దొంగలు వెళ్లిన వెంటనే మా కుమారులకు ఫోన్ చేశాను. 100 డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. సుమారు గంటపాటు దొంగలు ఇంట్లో ఉండి నానా బీభత్సం సృష్టించి పెద్ద ఎత్తున బంగారం నగదు ఎత్తుకొని వెళ్లడమే కాక ముగ్గురిపై కత్తులతో దాడి చేసి గాయపరచడం పట్టణంలో సంచలనంగా మారింది. అయితే రాఘవరెడ్డి కూతురు మానస ఆరు రోజుల క్రితమే అమెరికా నుండి పుట్టింటికి రాగా ఆమె ఒంటిపై ఉన్న బంగారం, ఆమె వెంట తెచ్చుకున్న నగదును గుర్తించి తెలిసిన వారే ఈ చోరీకి పాల్పడి ఉండి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. దొంగలు ఇంటి వెనక నుండి ఇంట్లోకి చొరబడి నీళ్ల మోటర్ ను ఆన్ చేసి చుట్టుపక్కల నల్లాలు విప్పి పడుకున్న వారికి మెలుకువచ్చే విధంగా చేసి తలుపు తీసి చూసే క్రమంలో చొచ్చుకుని లోపలికి వెళ్లి ఈ చోరీకి పాల్పడడం చూస్తుంటే ఇదంతా ఒక పథకం ప్రకారం చోరీ చేసినట్లుగా నిపుణులు భావిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ ఇంటి ముందు నుండి నేరుగా రంగనాయకుల గుట్ట వైపు సీసీ కెమెరాలు లేని రోడ్డు గుండానే వెళ్లడం గమనిస్తే దొంగలు పథకం ప్రకారం అటు సీసీ కెమెరాలు, ప్రజలు ఎక్కువగా ఉండరని భావించి వెళ్లినట్లుగా తెలుస్తుంది. బాధితులను చితకబాది హత్యాయత్నానికి పాల్పడి పెద్ద ఎత్తున చోరీకి పాల్పడడంతో హుజురాబాద్ పట్టణంతోపాటు జిల్లాలోనే ఈ సంఘటన సంచలనంగా మారింది. పూర్తి విచారణ జరిపిన అనంతరం వివరాలు వెల్లడిస్తామని టౌన్ సీఐ తిరుమల్ గౌడ్ తెలిపారు.

1,23,4.దొంగల దాడిలో గాయపడిన రాఘవరెడ్డి అతని భార్య వినోద… 5,6. బీరువాలో నుంచి బంగారు ఆభరణాలు దృశ్యం, కత్తులతో దాడి చేయడంతో రక్తం మడుగు కట్టిన దృశ్యం… డాగ్స్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్న ప్రత్యేక పోలీసులు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!