Social 1080×1350 • Multi-page
24-02-2025 BREAKING NEWS 07:49 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల సమస్యలపై గళమెత్తుతా!వారి సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలం..గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు ఎవరూ వారిని పట్టించుకో లేదు.. – బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య.

ప్రైవేటు టీచర్లు, లెక్చరర్ల సమస్యలపై గళమెత్తుతా!వారి సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలం..గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు ఎవరూ వారిని పట్టించుకో లేదు.. – బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య.
IMG_20250224_193050

–టీచర్ల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తా..మండలిలో మీ హక్కుల కోసం గొంతెత్తుతా!. –గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ ను మొత్తం భ్రష్టు పట్టించాయి.

–ఎమ్మెల్సీగా చాన్స్ ఇస్తే.. పీఆర్సీ, డీఏల కోసం కొట్లాడుతా..

–మండలిలో మీ హక్కుల కోసం గొంతెత్తుతా..బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ ఫిబ్రవరి 23: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ టీచర్స్ అభ్యర్థి మల్కా కొమరయ్య పేర్కొన్నారు. ఆదివారం రాత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మధువని ఫంక్షన్ హాల్ లో జరిగిన టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డీఎస్సీ వేయలేదని, ప్రైవేటు కళాశాలల యాజమాన్యలకు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని అన్నారు. గతంలో గెలిచిన ఎమ్మెల్సీలు ఎవరూ మిమ్మల్ని పట్టించుకోలేదని, ఈసారి కచ్చితంగా బీజేపీ అభ్యర్థిగా పలు ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన తనను గెలిపించి మండలికి పంపితే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో అటు విద్యార్థులు ఇటు ఉపాధ్యాయులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తానని,
తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రతి ఉపాధ్యాయుడు తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండి పాటుపడతానని మల్క కొమరయ్య పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తదితరులు కూడా మాట్లాడారు. దీనిలో పట్టణ మండల అధ్యక్షులు తూర్పాటి రాజు, రావుల కుమార్, టీయూపీఎస్, బీసీటీయూ, టీటీయూ తదితర సంఘాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072 మాట్లాడుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య
Oplus_131072 మాట్లాడుతున్న బిజెపి జిల్లా అధ్యక్షుడు జి కృష్ణారెడ్డి
Oplus_131072
Oplus_131072 సమ్మేళనానికి హాజరైన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!