Social 1080×1350 • Multi-page
27-02-2025 BREAKING NEWS 02:14 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ యందు 15 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సస్పెండ్.

హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ యందు 15 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సస్పెండ్.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ఏరియా ఆస్పత్రికి వచ్చిన రోగులను ప్రైవేట్‌ ఆస్పత్రులకు పంపిస్తున్నారని ఆరోపణల మేరకు వారం రోజుల క్రితం విచారణ జరిపిన డీఎంహెచ్‌వో వెంకటరమణ కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. 108లో పనిచేసే ఓ ఉద్యోగి ఏరియా ఆస్పత్రి ఎదుటనే మూడు అంబులెన్స్‌లను ఏర్పాటు చేసుకొని సెక్యూరిటీ గార్డ్స్‌, శానిటేషన్‌ సిబ్బందికి కమీషన్లు ఇచ్చి వారి సహాయంతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారనే ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. కలెక్టర్‌ వారిని తొలగించాలని ఆదేశించడంతో 15 మంది సిబ్బందిని తొలగించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజేందర్‌రెడ్డి తెలిపారు. ఇందులో సెక్యూరిటీగార్డ్స్‌ ఏడు మంది, సానిటేషన్‌ సిబ్బంది ఎనిమిది మంది ఉన్నారన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!