Social 1080×1350 • Multi-page
28-02-2025 BREAKING NEWS 06:39 PM
swarnodayam.com
Telugu Daily News

వివిఎస్.ఆర్ డిగ్రీ కళాశాల లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం..సైన్స్ డే సంద్భంగా విద్యార్థులకు క్యిజ్ పోటీలు.

వివిఎస్.ఆర్ డిగ్రీ కళాశాల లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం..సైన్స్ డే సంద్భంగా విద్యార్థులకు క్యిజ్ పోటీలు.
IMG-20250228-WA0161

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలం సింగాపురం వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాల లో ఈరోజు ప్రముఖ భారత శాస్త్రవేత్త, వైద్యుడు సర్ సివి రామన్ కనుకొన్న “రామన్ ఎఫెక్ట్ ” గౌరవార్థం, మనదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన నేషనల్ సైన్స్ డే (జాతీయ సైన్స్‌ దినోత్సవం) వి.వి.ఎస్.ఆర్ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. సైన్స్ మన జీవితాలపై చూపిన ప్రభావాన్ని గుర్తుచేసేందుకు ఈ నేషనల్‌ సైన్స్‌ డే జరుపుకుంటారని, ‘రామన్ ఎఫెక్ట్’ 1928 ఫిబ్రవరి 28వ తేదీన ఆవిష్కరణలోకి వచ్చినదని అధ్యాపకులు తెలిపారు. అందుకే ఈ చారిత్రాత్మక దినోత్సవాన్ని స్మరించుకునేందుకు ఈ రోజును సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారని, విద్యార్థులు సైన్స్‌ను చదవడానికి, సైన్స్ రంగం పట్ల ఆసక్తిని పెంచుకోవాలనీ సూచించారు. ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్‌తో జాతీయ సైన్స్‌ దినోత్సవం జరుపుతుంటారని, ఈ 2025వ సంవత్సరంలో ”వికసిత్ భారత్ కోసం సైన్స్ మరియు ఇన్నోవేషన్‌లో గ్లోబల్ లీడర్‌షిప్ కోసం భారతీయ యువతకు సాధికారత” థీమ్‌తో ఈ జాతీయ సైన్స్‌ దినోత్సవం జరుపుకుంటున్నారని వివరించారు. రామన్ ఎఫెక్ట్’ లేదా ‘రామన్ స్కాటరింగ్’ ప్రకారం.. ఒక కాంతి పుంజం పారదర్శక పదార్థం గుండా వెళ్ళినప్పుడు.. అది చెల్లాచెదురుగా వెళ్లి.. ఆ పదార్థం యొక్క పరమాణు నిర్మాణం గురించి సమాచారాన్ని వెల్లడిస్తుందన్నారు. ఈ ఆవిష్కరణ సివి రామన్ భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుచుకోవడానికి దారితీసిందని చెప్పారు. ఈ ఆవిష్కరణ తర్వాత భారత ప్రభుత్వం సి.వి రామన్‌ను దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వి.ఎన్ హనుమాకుమార్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. క్విజ్ కార్యక్రమం పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమం అధ్యాపకులు శనిగరపు రజిత, చల్లురి సతీష్, తాల్లపెల్లీ అజయ్ కుమార్, సిద్ధమల్ల విజయ్, పోతీరెడ్డి హరీష్, భాస్కర్, మహేష్, సదయ్యా, రమాదేవి, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!