Social 1080×1350 • Multi-page
03-03-2025 BREAKING NEWS 11:38 PM
swarnodayam.com
Telugu Daily News

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ద్వార పూజ మహోత్సవం

శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ద్వార పూజ మహోత్సవం
IMG_20250303_233426

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని సైదాపూర్ రోడ్ లోని ఎస్ ఆర్ఎస్పి కెనాల్ పక్కన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఈరోజు అత్యంత పవిత్రమైన ద్వార పూజ (దర్వాజా) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు భక్తిశ్రద్ధలతో పాల్గొని, స్వామివారి అనుగ్రహాన్ని పొందే భాగ్యాన్ని పొందారు.

ఈ ద్వార పూజలో “కడప పెట్టుట” వంటి శాస్త్రోక్త రీతిలో వేడుకలు వేద పండితుడు పందిళ్ళ భాస్కర్ శర్మ, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ దొంత రమేష్ ల ఆధ్వర్యంలో నిర్వహించారు. దేవస్థాన నిర్వాహకులు, అర్చకులు, భక్తగణం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారికి శతకోటి పాదాభివందనాలు అర్పించారు. ఈ ప్రత్యేక సందర్భంలో శ్రీ లక్ష్మీ గణపతిస్వామి కృపతో భక్తులంతా మంగళమయ జీవితాన్ని అనుభవించాలని ప్రార్థించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!