04-03-2025 NORMAL NEWS 04:36 PM
swarnodayam.com
Telugu Daily News
04-03-2025 04:36 PM By Mandala Yadagiri

సెయింట్ థామస్ పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.-ఆకట్టుకున్న చిన్నారుల ఆట పాటలు.

సెయింట్ థామస్ పాఠశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు.-ఆకట్టుకున్న చిన్నారుల ఆట పాటలు.
Oplus_131072

సర్టిఫికెట్లు అందుకున్న విద్యార్థులు.

కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని సెయింట్ థామస్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ విభాగం విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల కరస్పాండెంట్& ప్రిన్సిపల్ ఫాదర్ శరన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ హేమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు పట్టాలను అందించారు. చిన్నారులు పట్టాలను అందుకుని సందడి చేశారు. చిన్నారుల ఆట పాటలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072 పట్టాలు అందుకొని సందడి చేస్తున్న చిన్నారులు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!