04-03-2025 NORMAL NEWS 07:26 PM
swarnodayam.com
Telugu Daily News
04-03-2025 07:26 PM By Mandala Yadagiri

7న సీఐటీయూ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జయప్రదం చేయండి

7న సీఐటీయూ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జయప్రదం చేయండి
IMG_20250304_192512

కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున ఆశ వర్కర్స్ వద్దకి సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ సందర్శించి 7వ తేదిన సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయం ముకుంద లాల్ మిశ్రా భవన్లో జరిగే అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంను విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..20వ శతాబ్దం ప్రారంభంలో క్రూరమైన దోపిడీ మరియు అమానవీయ పరిస్థితులకు సామ్రాజ్యవాద యుద్దాలకు వ్యతిరేకంగా మరియు తమకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ తో మహిళ కార్మికులు చేసిన పోరాటాల ఫలితంగా మనం ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. జర్మన్ విప్లకారిని క్లారా జట్కిన్ ప్రతిపాదన ప్రకారం ఆగస్టు 1910 డెన్మార్క్ లో అంతర్జాతీయ సోషలిస్ట్ ఉమెన్స్ కాన్ఫరెన్స్ లో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని నిర్ణయించారని తెలిపారు. 1975లో ఐక్యరాజ్యసమితి దీనిని అధికారికంగా గుర్తించడంతో భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రారంభమైందన్నారు. మహిళలకు సమానత్వం, న్యాయం, దోపిడీ వివక్ష మరియు హింస లేని జీవితం లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతున్నదని వివరించారు. భారతదేశంలో దాదాపు 70 శాతం మహిళలు నిరుద్యోగులు ప్రమాదకరమైన స్వభావం కలిగిన పనుల్లో ఎక్కువగా పని చేస్తున్నారని, దీనితోపాటు ఎటువంటి వేతనాలు చెల్లించని పనుల్లో మహిళల వాటా పెరుగుతుందన్నారు. అంగన్వాడి, ఆశా, మధ్యాహ్న భోజనం, జాతీయ ఆరోగ్య మిషన్ మొదలైన కేంద్ర పథకాలలో పనిచేసే కార్మికులు అత్యధికలు మహిళలే వీరిని బిజెపి ప్రభుత్వం కార్మికులుగా గుర్తించలేదన్నారు. కనీస వేతనాలు అమలు చేయడం లేదని, వేతనం, పారితోశికం గల పేరుతో శ్రమదోపిడి చేస్తుందని అన్నారు. ముఖ్యంగా ఆశా కార్మికులకు చట్టబద్ధమైన హక్కులపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేయడం లేదు అన్నారు. భారతీయ మహిళలో 40% మంది పిల్లలు వృద్దుల సంరక్షణ లేదని, జీతభత్యంలోని రోజుకు ఆరు గంటలు వెచ్చిస్తున్నారని లెక్కలు చెబుతున్నాయన్నారు. జిడిపిలో మహిళ కుటుంబాల పని విలువ సంవత్సరానికి 22 లక్షల కోట్లుగా మహిళలు చేస్తున్న పనిని ప్రభుత్వం గుర్తించాలని సిఐటియు చాలా కాలం నుండి డిమాండ్ చేస్తుందని అన్నారు. అశ వర్కర్స్ ని కార్మికులుగా ఉద్యోగుల గుర్తించి రెగ్యులర్ చేయాలి.అని 15వ ఐ ఎల్ సి యొక్క సిఫారసుల ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని మహిళా కార్మికులందరికీ ప్రసూతి సెలవులు, ప్రసవ సౌకర్యాలు, నర్సింగ్ విరామాలు కల్పించాలన్నారు. పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నివేదిక చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, కార్యాలయంలో మహిళలకు భద్రత కల్పించి సురక్షితమైన ప్రయాణ ఏర్పాటు చేయాలని, మహిళలతో రాత్రి వేళలో పని చేయించకూడదని డిమాండ్లతో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున జిల్లాలోని ఆశా కార్మిక వర్గం హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మారెళ్ళ శ్రీలత, సిఐటియు నాయకులు చెల్పూరి రాము, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సుజాత, స్వప్న, కవిత, కోమల, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!