Social 1080×1350 • Multi-page
05-03-2025 BREAKING NEWS 06:30 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను బయటకు తీయాలి. -ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రభావితం చూపుతున్నాయి…-ఎంఈఓ శ్రీనివాస్

విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను బయటకు తీయాలి. -ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక రంగాలు ప్రభావితం చూపుతున్నాయి…-ఎంఈఓ శ్రీనివాస్
IMG-20250305-WA0196

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్:
ప్రతి విద్యార్థులో దాగివున్న సృజనాత్మకతను బయటకు తీయాలని నేటి ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక రంగాల ప్రభావం మానవ జీవితంపై ఉందని మండల విద్యాధికారి బి శ్రీనివాస్ అన్నారు. బుధవారం పట్టణంలోని మాంటిసోరి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్ పర్సన్ జోస్ నెడుంతుండం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఎదగాలని, అన్ని రంగాల్లో ముందుండాలని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన GSLVM3 అందరి దృష్టిని ఆకట్టుకుంది. అదేవిధంగా రోబోట్ విన్యాసాలు కూడా పాల్గొని ఉత్తేజపరిచాయి. అలాగే విద్యార్థులు ఏర్పాటు చేసిన బ్లడ్ గ్రూప్ ఐడెంటిఫికేషన్ టెస్ట్, హైడ్రాలిక్ లిఫ్ట్, గ్లాస్ ఫర్ నైట్ బ్లైండ్ నెస్, హీమో డయాలసిస్, థర్మల్ పవర్ ప్లాంట్, లేజర్ అలారం, రేన్ వాటర్ హార్వెస్టింగ్ తదితర ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి గీతా షాజు, డైరెక్టర్ షాజు థామస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Oplus_131072 ఎంతో మందిని ఆకట్టుకున్న జీఎస్ ఎల్ వీ3 ప్రయోగం నమూనా…
Oplus_131072 ఆకట్టుకున్న రోబోటిక్
Oplus_131072 మాట్లాడుతున్న గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్ పర్సన్ జోస్ నెడుంతుండం
Oplus_131072
Oplus_131072 మాట్లాడుతున్న మండల విద్యాధికారి బి శ్రీనివాస్
Oplus_131072 ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బహుమతులను అందజేస్తున్న పాఠశాల చైర్మన్..
Oplus_131072 ప్రతిభావంతులైన విజేతలకు బహుమతులతో పాఠశాల నిర్వాహకులు, ముఖ్యఅతిథి ఎంఈఓ, ఉపాధ్యాయులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!