పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన మండల విద్యాధికారి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో జరిగే పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను గురువారం హుజూరాబాద్ మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్ సందర్శించి తనిఖీలు చేశారు. ఈ నెల 6 నుండి 15 వరకు పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల నిర్వహణ ప్రభుత్వం చేస్తున్నందున ఆయా పరీక్షలు జరుగుతున్న తీరును ఆయన పట్టణంలోని వివిధ పాఠశాలలను సందర్శించి తనిఖీలు చేశారు. విద్యార్థులకు పరీక్షల సమయంలో ఎలాంటి ఏర్పాటు ఆయా పాఠశాలలు చేశాయో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫ్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించాలని, పరీక్ష సమయం కూడా ప్రభుత్వం సూచించిన సమయంలోనే నిర్వహించాలన్నారు. ప్రీ ఫైనల్ పరీక్షల ముందే ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి పాఠశాల పదవ తరగతి విద్యార్థులు ప్రీ ఫైనల్ పరీక్షలు రాయడానికి అనుకూలమైన వసతులు ఏర్పరచాలని అన్నారు.



