Social 1080×1350 • Multi-page
07-03-2025 BREAKING NEWS 05:03 PM
swarnodayam.com
Telugu Daily News

రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ ల బదిలీ..బదిలీ అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు.

రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ ల బదిలీ..బదిలీ అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు.
Oplus_131072

–ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం స్థానం చలనం.

–మిగిలిన 14 మంది ఎస్పీలకు బదిలీ.

స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు ఉన్నారు. బదిలీ అయిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం, వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్, నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య, రామగుండం సీపీగా అంబర్ కిషోర్ జూ, ఇంటలిజెన్స్ ఎస్పీగా సిందుశర్మ, భువనగిరి డీసీపీగా ఆకాంక్ష యాదవ్, మహిళ భద్రత విభాగం ఎస్పీగా చేతన, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్, కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర, సంగారెడ్డి ఎస్పీ పారితోష్ పంకజ్, రాజన్న సిరిసిల్ల ఎస్పీగా జీఎం బాబా సాహెబ్, వరంగల్ డీసీపీగా అంకిత్ కుమార్, మంచిర్యాల డీసీపీగా ఏ.భాస్కర్, సూర్యాపేట ఎస్పీగా కె.నర్సింహ, హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా శిల్పవల్లి, ఎస్‌ఐబి ఎస్పీగా సాయి శేఖర్, పెద్దపల్లి డీసీపీగా పి కరుణాకర్, సిఐడి ఎస్పీగా రవీందర్ లను నియమిస్తూ డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!