Social 1080×1350 • Multi-page
08-03-2025 BREAKING NEWS 07:54 PM
swarnodayam.com
Telugu Daily News

మంత్రి కొండ సురేఖను కలిసిన ప్రణవ్..

మంత్రి కొండ సురేఖను కలిసిన ప్రణవ్..
IMG_20250308_195152

–త్వరలోనే ఇళ్ళందకుంట ఆలయ కమిటీ ఏర్పాటు.

–హుజురాబాద్ లోని దేవాలయాల సమస్యలపై వినతి పత్రం అందజేత..

–రాములోరి కళ్యాణానికి ఘనంగా ఏర్పాట్లు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న దేవాలయల అర్చకుల సమస్యలపై దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను శనివారం నాడు హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ఈ సందర్భంగా అపర భద్రాద్రిగా పేరొందిన ఇళ్ళందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన కమిటీ త్వరలోనే ఏర్పాటు చేసి, బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహిస్తామని మంత్రికి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని, దాంట్లో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గ దేవాలయాల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు ప్రణవ్ తెలిపారు.

మంత్రి కొండా సురేఖ కు వివరిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్..

మంత్రి కొండా సురేఖకు వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!