Social 1080×1350 • Multi-page
09-03-2025 BREAKING NEWS 11:08 PM
swarnodayam.com
Telugu Daily News

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..24 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..24 ఏళ్ల తర్వాత కలుసుకున్న మిత్రులు
IMG_20250309_230530

గురువులకు ఆత్మీయ సత్కారం

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చెసుకున్నపూర్వవిద్యార్థులు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (సైదాపూర్)మార్చి9: సైదాపూర్ మండలం వెన్నంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 2001-2002 వ 10వ తరగతికి చెందిన దాదాపు 50మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై ఆదివారం కలిశారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియాను వేదికగా కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆరోజు ఆంత సంతోషంగా ఆడుతు పాడుతు గడిపారు. చిన్ననాడు చేసిన అల్లరి పనులు, గడచిన రోజులను, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు, కుటుంబ పరిస్థితులు, జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు. కుటుంబ సమస్యలు, ఉద్యోగాలు, బిజీబిజీ జీవితంలోను అందరూ ఒకే చోట కలవడంతో పండగ వాతావరణం నెలకొంది. నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకొని శాలువాలు కప్పి మెమొంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన తోచిన సహాయం చేద్దాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గురువులు విడుపు శ్రీనివాస్ ( ఎంఈఓ ) వైద్యుల జైపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, వేణుగోపాల్, రాజిరెడ్డి, రాజయ్య, రవి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!