Social 1080×1350 • Multi-page
10-03-2025 BREAKING NEWS 03:07 PM
swarnodayam.com
Telugu Daily News

ఘనంగా జరిగిన సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి.

ఘనంగా జరిగిన సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి.
IMG_20250310_150430

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మహాసాద్వి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి హుజురాబాద్ లో జ్యోతిరావు పూలే జయంతి కమిటీ అధ్యక్షుడు ఉప్పు శ్రీనివాస్ పటేల్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చౌరస్తా వద్ద ఘనంగా జరిగింది. ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి నాయకులందరూ ఘనంగా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ తాను మొదట విద్య నేర్చుకుని తర్వాత భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా అవతరించి పేద ప్రజలకు మహారాష్ట్ర ప్రాంతంలో విద్యలయాలు స్థాపించి పేద వర్గాల పిల్లలకు చదువును నేర్పించారని తర్వాత జ్యోతిరావు పూలే దంపతులు వృద్ధులకు, వితంతువులకు వసతి గృహాలు ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నారని వారి సేవలను గుర్తు చేసుకున్నారు. సావిత్రిబాయి పూలే జీవితం నేటి మహిళలకు ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ మునిసిపల్ కమిషనర్ కెంసారపు సమ్మయ్య, జ్యోతిరావు పూలే జయంతి కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్ పటేల్, ప్రధాన కార్యదర్శి రఘుచారి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గందే రాధిక, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, అంబేద్కర్ జయంతి కమిటీ చైర్మన్ మహమ్మద్ కాలిక్ హుస్సేన్, గుడిపాటి జైపాల్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు యేముల పుష్పలత , సొల్లు సునీత , పుల్ల రాధ, గోస్కుల నాగమణి, మల్లీశ్వరి, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, సొల్లు బాబు, కొలిపాక సమ్మయ్య, వేల్పుల రత్నం, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, వేల్పుల ప్రభాకర్, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, ఎస్కే జలీల్ , గోస్కుల మధు, రియాజ్, మొలుగు ప్రభాకర్, తులసి లక్ష్మణమూర్తి, మార్త రవీందర్, ఇల్లందుల సమ్మయ్య, ఎర్ర శ్రీధర్, బొరగాల సారయ్య, పసుల స్వామి, మిడిదొడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
Oplus_131072 సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!