10-03-2025 NORMAL NEWS 07:20 PM
swarnodayam.com
Telugu Daily News
10-03-2025 07:20 PM By Mandala Yadagiri

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో దోషులను శిక్షించేలా కృషిచేసిన డిఎస్పి శ్రీనివాస్ కు అభినందనలు… -తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్.

మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో దోషులను శిక్షించేలా కృషిచేసిన డిఎస్పి శ్రీనివాస్ కు అభినందనలు… -తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్.
Oplus_131072


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : 2018లో విద్యార్థి పి ప్రణయ్ ని సూపారి గ్యాంగ్ తో హత్య చేయించిన సెన్సేషనల్ కేసులో 8 మంది నిందితులకు శిక్షలు పడేలా చేసిన అప్పటి డి.ఎస్.పి పద్మనాభుల శ్రీనివాస్ కృషి అభినందనీయమని తెలంగాణ యూత్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్ పేర్కొన్నారు. సోమవారం ఆయన డీఎస్పీ శ్రీనివాసును కలిసి అభినందనలు తెలిపిన అనంతరం హుజురాబాద్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడ కు చెందిన మారుతీరావు తన కూతురు దళితుడైన పి ప్రణయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నదన్న ఆక్రోషంతో సుపారీ గ్యాంగ్ మాట్లాడి అత్యంత దారుణంగా హత్య చేయించడం ఆ రోజుల్లో తెలుగు రాష్ట్రాలల్లో సంచలనం కలిగించిందన్నారు. హత్య జరిగిన సమయంలో మిర్యాలగూడ డిఎస్పీగా ఉన్న పద్మనాబుల శ్రీనివాస్ 8 మంది నిందితులను దోషులుగా కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారన్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ హైడ్రాలో డీఎస్పీ స్థాయి ప్రత్యేక అధికారిగా కొనసాగుతుండగా సంచలనం కలిగించిన ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి నిందితులకు కఠినంగా శిక్షలు పడేలా కృషిచేసిన శ్రీనివాస్ చర్యలు పోలీస్ డిపార్ట్మెంట్ కి గర్వకారణం అన్నారు. భవిష్యత్తులో ఎవరైనా పరువు హత్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు అన్న రీతిలో పోలీస్ అధికారిగా డిఎస్పి పి శ్రీనివాస్ కృషి పోలీసు డిపార్ట్మెంట్ పరువు నిలబడమే కాక పరువు హత్యలను అరికట్టడంలో తనదైన శైలిలో వ్యవహరించడం రాష్ట్రానికే గర్వకారణమని అర్జున్ పేర్కొన్నారు. నిందితులకు శిక్ష ఖరారు కావడంలో సాక్షులను ప్రవేశపెట్టి కృషి చేసిన డిఎస్పి పి శ్రీనివాస్ కు అర్జున్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Oplus_131072

Oplus_131072 అప్పటి డిఎస్పి పద్మనాభూల శ్రీనివాస్ ను కలిసి అభినందనలు తెలుపుతున్న తెలంగాణ యూత్ ఫోర్సు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్వి అర్జున్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!