11-03-2025 NORMAL NEWS 02:37 PM
swarnodayam.com
Telugu Daily News
11-03-2025 02:37 PM By Mandala Yadagiri

కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కోమటి శ్రీనివాస్.

కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా కోమటి శ్రీనివాస్.
IMG-20250311-WA0144

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ మార్చి 11: హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కొల్లూరి కిరణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడిగా కోమటి శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుని వలే పనిచేసి రాబోయే ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలను గెలిపించుకొని కాంగ్రెస్ జెండా ఎగరవేయడంలో కాంగ్రెస్ నాయకులు ముందు వరుసలో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!