12-03-2025 NORMAL NEWS 11:43 AM
swarnodayam.com
Telugu Daily News
12-03-2025 11:43 AM By Mandala Yadagiri

కెసిఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు..! -హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

కెసిఆర్ ని, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు..! -హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు ప్రచారాలు చేస్తూ… తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. హుజురాబాద్ MLA పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. “బీఆర్ఎస్ నా కుటుంబం…కెసిఆర్ నా నాయకుడు, ఎప్పటికీ అదే పార్టీ, అదే నాయకుడి వెంట ఉంటా.. బీఆర్ఎస్ కి నాకు వున్న అనుబంధాన్ని ఎవరూ తెంచలేరు,” అని ధ్వజమెత్తారు.

“కొంతమంది నా ప్రజాదరణను చూసి ఓర్వలేక… కాంగ్రెస్ పార్టీకి వున్న చేతగాని పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ నా రాజకీయం, నా నమ్మకం, నా జీవితం అంతా బీఆర్ఎస్ పార్టీకి అంకితం! అధికారంలో వున్నా, లేకపోయినా…నేను కెసిఆర్ తోనే ఉంటా!” అనీ కౌశిక్ స్పష్టం చేశారు.

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై పరువు నష్టం దావా వేయబోతున్నట్లు, అలాగే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరించారు. “బీఆర్ఎస్ కుటుంబ సభ్యులెవ్వరూ ఇలాంటి అబద్ధాలను నమ్మొద్దు.. వీటిని ధీటుగా తిప్పికొట్టాలి… వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం!” అని కౌశిక్ రెడ్డి ధీమాగా చెప్పారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!