Social 1080×1350 • Multi-page
12-03-2025 BREAKING NEWS 05:06 PM
swarnodayam.com
Telugu Daily News

అట్టహాసంగా మల్లిఖార్జున స్వామి కమాన్ ఆర్చికి గ్రామస్థులతో భూమి పూజ… – కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు.

అట్టహాసంగా మల్లిఖార్జున స్వామి కమాన్ ఆర్చికి గ్రామస్థులతో భూమి పూజ…  – కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సంఘాల జాతీయ నాయకుడు పోలాడి రామారావు.
IMG_20250312_170019

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల వన్నారం గ్రామంలో వన్నారం గ్రామం నుంచి గంగిపల్లి గ్రామ ప్రధాన రహదారిలో గల గంగిపల్లి గ్రామ శివారులో నెలకొన్న భ్రమరాంభ మల్లిఖార్జునస్వామి దేవాలయ కమాన్ ఆర్చి నిర్మాణానికి వన్నారం గ్రామ ప్రధాన రహదారి ముఖ ద్వారం వద్ద బుధవారం వన్నారం గ్రామ ప్రజల అట్టహాసంగా భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ నిర్మాణానికి ఖర్చయ్యే దాదాపు నాలుగు లక్షల రూపాయలు గ్రామస్తులే స్వచ్ఛందంగా విరాళాల రూపంలో సమకూర్చుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో వన్నారం గ్రామానికే చెందిన సీనియర్ సిటిజన్ రైతు, ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ నాయకుడు పోలాడి రామారావు, గ్రామ పంచాయతి సెక్రటరీ శారద, మాజీ సర్పంచులు భాకారపు శ్రీనివాస్, మద్దెల లక్ష్మయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చలిగంటి ఓదెలు, మాజీ ఎంపీటీసీ గంగుల రవి, మాజీ ఉపసర్పంచులు బకారపు తిరుపతి, బుద్దుల తిరుపతి, సీనియర్ సిటిజన్లు పోలాడి యాదగిరిరావు, సంబ కొమురయ్య, తాల్లపల్లి కొమురయ్య, ఒడ్నాల బాలింగం, పోలాడి ప్రభాకర్ రావు, ఆకునూరి లచ్చయ్య, మద్దెల స్వామి, శివరాత్రి కొమరయ్య, బాకారపు ఓదెలు, బాకారపు మల్లేష్, మద్దెల చంద్రయ్య, బొంపెల్లి స్వామి, రావుల అశోక్, పూజారి సంతోష్ తదితరులతో పాటు గ్రామ పంచాయతి ఉద్యోగులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహ భరితంగా పాల్గొని దేవాలయ కమాన్ ఆర్చి నిర్మాణ పనులు ప్రారంభించారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072 ఆర్చి నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న పోరాడి రామారావు, గ్రామ పెద్దలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!