13-03-2025 NORMAL NEWS 12:39 PM
swarnodayam.com
Telugu Daily News
13-03-2025 12:39 PM By Mandala Yadagiri

స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఎండిపోయిన వేప చెట్టు పొంచి ఉన్న ప్రమాదం

స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఎండిపోయిన వేప చెట్టు పొంచి ఉన్న ప్రమాదం
IMG-20250313-WA0068

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఎండిపోయిన వేప చెట్టు ప్రమాదకరంగా మారడంతో పలువురు ఆందోళన చెందుతున్నారు. హుజురాబాద్ పట్టణంలో ఎండిపోయిన వేప చెట్లు రద్దీగా ఉండే ప్రదేశంలో ఉన్నవి. వీటీని పట్టించుకునే నాధుడు లేరు. ఒక చెట్టు సిటీ ఫంక్షన్ హాల్ దగ్గర మరియు స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(మామ కృష్ణారెడ్డి) ఇంటి గేటుకు ఎదురుగా ఉన్నాయి. మునిసిపల్ అధికారులు ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించాలని పలువురు కోరుతున్నారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి సమీపంలో ఎండిపోయిన వేప చెట్టు ఉండడంతో ఎమ్మెల్యే కోసం హుజురాబాద్ వచ్చినప్పుడు ఎంతోమంది ప్రజలు అక్కడ నిల్చుంటారు. ఒకవేళ ఈ వేప చెట్టు కొమ్మలు విరిగి పడినట్లయితే ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. కనుక బల్దియా కమిషనర్ జోక్యం చేసుకొని ఈ చెట్లను నరికి ప్రజల ప్రాణాలు కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Oplus_131072

హుజురాబాద్ ఎమ్మెల్యే నివాసం ఎదురుగా ప్రమాదకరంగా మారిన ఎండిన చెట్టు..

Oplus_131072

సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్ ఎదురుగా చెట్టు ఎండిపోయి ప్రమాదకరంగా మారిన దృశ్యం.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!