Social 1080×1350 • Multi-page
13-03-2025 BREAKING NEWS 04:18 PM
swarnodayam.com
Telugu Daily News

మున్సిపల్ కమిషనర్ ను కలసిన జేఏసిప్రతినిధులు.

మున్సిపల్ కమిషనర్ ను కలసిన జేఏసిప్రతినిధులు.
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:


హుజురాబాద్ మున్సిపల్ కమీషనర్ కే సమ్మయ్యను జేఏసీ ప్రతినిధులు గురువారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిసారు. ఈ సందర్బంగా హుజురాబాద్ పట్టణంలోని సమస్యల గురించి చర్చించారు. ఇదే సమయంలో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమీషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫెరెన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమీషనర్లతో మాట్లాడారు.
మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్య పని విధానాన్ని డైరెక్టర్ ప్రశంసించడం విశేషం. ఆస్తిపన్ను వసూళ్ళలో హుజురాబాద్ మున్సిపాలిటీ తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు చేస్తూనే, భవిష్యత్ లో తీసుకోబోయే కార్యాచరణపై డైరెక్టర్ మార్గదర్శనం చేశారు. మున్సిపల్ కమిషనర్ కే సమ్మయ్యను, సిబ్బందిని జేఏసీ ప్రతినిధులు కూడా అభినందించారు. మున్సిపల్ కమిషనర్ ను కలుసుకున్న వారిలో హుజురాబాద్ జే.ఏ.సి చైర్మన్ ఆవునూరి సమ్మయ్య, కన్వీనర్ వేల్పుల రత్నం, ప్రజా సంఘాల నాయకులు పొడిశెట్టి వెంకటరాజం, పులి జగన్నాథం వున్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!