Social 1080×1350 • Multi-page
13-03-2025 BREAKING NEWS 08:13 PM
swarnodayam.com
Telugu Daily News

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు -హుజరాబాద్ సిఐ తిరుమల్ గౌడ్

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు -హుజరాబాద్ సిఐ తిరుమల్ గౌడ్
IMG_20250313_201110

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హోలీ పండుగ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘిస్తూ శాంతి భద్రతలకు విగాథం కలిగిస్తే చర్యలు తప్పవని హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ హెచ్చరించారు. హోలీ పండుగని పురస్కరించుకుని గురువారం వాహన తనిఖీల్లో భాగంగా ఆయన మాట్లాడారు. హోలీని సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని సూచించారు. మద్యం సేవించి రోడ్లపై హంగామా సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. హోలీ పూర్తి అయిన అనంతరం కాలువలోకి బావుల, లోతుగా ఉన్న కెనాల వద్దకి వెళ్లకూడదని ఆయన సూచించారు. పోలీస్ యంత్రాంగం హోలీకి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇతనికిలో ఎస్సైలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072 వాహన తనిఖీని పరిశీలిస్తున్న సిఐ తిరుమల్ గౌడ్
Oplus_131072 అంబేద్కర్ చౌరస్తాలో బందోబస్తు నిర్వహిస్తున్న సిఐ తిరుమల గౌడ్

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!