Social 1080×1350 • Multi-page
15-03-2025 BREAKING NEWS 09:44 PM
swarnodayam.com
Telugu Daily News

చెల్పూరులో భక్తిశ్రద్ధలతో లక్ష్మీనర్సింహస్వామి విగ్రహ ప్రతిష్టాపణ.

చెల్పూరులో భక్తిశ్రద్ధలతో లక్ష్మీనర్సింహస్వామి విగ్రహ ప్రతిష్టాపణ.
IMG_20250315_214118

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ మార్చి 15: హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని “లక్ష్మినర్సింహస్వామి” దేవాలయంలో లక్ష్మినర్సింహస్వామి ఉత్సవ విగ్రహాల ప్రతిష్టాపన, కళ్యాణ మండపం ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదపండితులు ఉదయమర్రి కృష్ణమూర్తిశర్మ గ్రామంలోని ప్రజలంతా ఆయురారోగ్యంగా ఉండాలని, పాడి పంటలతో తులతూగాలని లక్ష్మీనర్సింహస్వామి విగ్రహాప్రతిష్టాపనను జరిపించామని తెలిపారు. మూడు రోజుల ప్రతిష్టాపన వేడుకలలో భాగంగా ఈరోజు మూడవరోజు “శ్రీ లక్ష్మీనరసింహస్వామి” విగ్రహ ప్రతిష్టాపన మరియు ప్రాణ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్టాపన, నవగ్రహాల ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమానికి కన్నుల పండువగా అశేషమైన భక్తజనం దేవస్థానానికి విచ్చేసి “దైవ నామస్మరణ” హర్షద్వనాలతో దేవుణ్ణి స్మరించుకుంటూ స్వామివారి కళ్యాణం మరియు హోమం తిలకించారు. అనంతరం భక్తులు భక్తిశ్రద్ధలతో భగవంతున్ని ధ్యానిస్తూ, తీర్థప్రసాదాలు మరియు అన్నప్రసాదాలు స్వీకరించి, ఆ భగవంతుని కృపకు పాత్రులు అయ్యారు. కార్యక్రమంలో “ఉదయమరి కృష్ణమూర్తి శర్మ”, దామెర వెంకటేశ్వర చార్యులు, దామెర కృష్ణమూర్తి, దామెర శేషాచార్యులు, వేదపండితులు దామెర హయగ్రీవ చార్యులు, వెంకట రమణాచార్యులు, మరియు అశేషమైన భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!