16-03-2025 NORMAL NEWS 02:17 PM
swarnodayam.com
Telugu Daily News
16-03-2025 02:17 PM By Mandala Yadagiri

మృతుల కుటుంబాలకు మాజీ ఎంపీపీ ఆర్థిక సహాయం

మృతుల కుటుంబాలకు మాజీ ఎంపీపీ ఆర్థిక సహాయం
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఇరువురి కుటుంబ సభ్యులను హుజురాబాద్ తాజా మాజీ ఎంపీపీ ఇరుమల్ల రాణిసురేందర్ రెడ్డి సందర్శించి వారిని పరామర్శించారు. చెల్పూర్ కు చెందిన బండారి రమ్య ఇటీవల అనారోగ్య కారణంతో మరణించగా వారి కుటుంబాన్ని వెళ్లి పరామర్శించి వారికి రూ.5000 ఆర్థిక సహాయం అందించారు. అలాగే శనిగరం ఐలయ్య ఇటీవల అనారోగ్య కారణంతో మరణించగా వారికి రూ.5000 ఆర్థిక సహాయంను మాజీ ఎంపిపి రాణిసురేందర్ రెడ్డి అందజేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి వెంట మాజీ ఎంపీటీసీ సదానందం, మాజీ ఉపసర్పంచ్ జయసుధవాసుదేవ రెడ్డి, శంకరయ్య, సింగిల్ విండో డైరెక్టర్ విశ్వనాధ్, రాజు, చిరంజీవి, రాకేష్, రమేష్, సృజన్,తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072 మృతుల కుటుంబాలను పరామర్శిస్తున్న తాజా మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!