Social 1080×1350 • Multi-page
16-03-2025 BREAKING NEWS 09:12 PM
swarnodayam.com
Telugu Daily News

లింగారావు స్మారకార్థం అనాధ పిల్లలకు అన్నదానం పండ్ల పంపిణీ

లింగారావు స్మారకార్థం అనాధ పిల్లలకు అన్నదానం పండ్ల పంపిణీ
IMG_20250316_210747

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): హుజురాబాద్ పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త, ప్రముఖ వ్యాపారి వర్ధినేని రవీందర్ రావు సోదరుడు (అన్న) వర్దినేని లింగారావు ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం జమ్మికుంటలోని స్పందన అనాధ శరణాలయంలో రవీందర్ రావు – లక్ష్మీ దంపతులు సుమారు 50 మంది పిల్లలకు అన్నదానం నిర్వహించి, పండ్లు పంపిణీ చేశారు. శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఆదర్శ రైతు వర్ధినేని లింగారావు ఏడాది క్రితమే మృతిచెందగా నేడు ప్రథమ వర్ధంతి పురస్కరించుకొని ఆయన సోదరుడు రవీందర్ రావు -లక్ష్మి దంపతులు అనాధ పిల్లలకు స్వయంగా వడ్డించి స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి లింగారావు రైతుగా ప్రజలకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. తమలాగే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి స్పందన ఆర్పాన్ సేవా సొసైటీకి చేయుతను అందించాలని ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త రవీందర్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, సేవా సంస్థ నిర్వాహకులు, అనాధ బాలలు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072
Oplus_131072

జమ్మికుంట అర్పాన్ సొసైటీలో అన్నదానం నిర్వహిస్తున్న వర్ధినేని రవీందర్ రావు లక్ష్మీ దంపతులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!