Social 1080×1350 • Multi-page
17-03-2025 BREAKING NEWS 06:04 PM
swarnodayam.com
Telugu Daily News

పరిసరాల పరిశుభ్రతతో అంటువ్యాధులు దూరం.. అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య

పరిసరాల పరిశుభ్రతతో అంటువ్యాధులు దూరం.. అవగాహన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య
IMG-20250317-WA0157

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పరిసరాల పరిశుభ్రతతో అంటువ్యాధులు దూరమవుతాయని హుజురాబాద్ మునిసిపల్ కమీషనర్ కే సమయ్య పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతీష్టాత్మకముగా ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ – 2025 కార్యక్రమములో భాగంగా, సోమవారం హుజూరాబాద్ పట్టణమును స్వచ్చ హుజూరాబాద్ గా తీర్చిదిద్దుటకు గాను ప్రజలెవ్వరు కూడా చెత్తను రోడ్ల పై వేయకుండా పరిసరాల పరిశుభ్రతను పాటించాలని పురపాలక సంఘ కమిషనర్ కెంసారపు సమ్మయ్య పేర్కొన్నారు. పట్టణములోని 22వ వార్డులో తడి పొడి చెత్తలను వేరు చేయడం వలన కలిగే ప్రయోజనాల గురించి వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. 22వ వార్డు తాజా మంచి కౌన్సిలర్ పైళ్ల వెంకటరెడ్డి, సామాజిక కార్యకర్త వర్ధినేని రవీందర్ రావు మాట్లాడుతూ వార్డు ప్రజలు కాలుష్య రహిత, చెత్త రహిత వార్డుగా నిలిపేందుకు సహకరించాలని కోరారు . ఈ కార్యక్రమంలో కమిషనర్ కెంసారపు సమ్మయ్య, 22వ వార్డు తాజా మాజీ వార్డు సభ్యులు పైళ్ళ వెంకట్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ ఏం కిషన్ రావు, సానిటరీ జవాన్ రొంటాల సుధీర్, మెప్మా CLRP & RP జె రమాదేవి, 22వ వార్డు ప్రజలు మరియు పురపాలక సంఘ పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.

తడి చెత్త పొడి చెత్త పై వార్డు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కమిషనర్, సామాజిక కార్యకర్త..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!