17-03-2025 NORMAL NEWS 07:20 PM
swarnodayam.com
Telugu Daily News
17-03-2025 07:20 PM By Mandala Yadagiri

మానవత్వం చాటుకున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి.. -క్షతగాత్రులను తన సొంత వాహనంలో హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

మానవత్వం చాటుకున్న అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి.. -క్షతగాత్రులను తన సొంత వాహనంలో హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
IMG-20250317-WA0169

మొలంగూర్ క్రాస్ వద్ద ప్రమాదం

ఎదురెదురుగా ఢీకొన్న రెండు మోటర్ బైక్ లు

మండల యాదగిరి, స్వర్ణ ఉదయం ప్రతినిధి హుజురాబాద్ (కేశవపట్నం) : మొలంగూర్ క్రాస్ రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చూసి కాంగ్రెస్ నాయకుడు అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి చలించిపోయాడు. కరీంనగర్ నుండి వర్ధన్నపేట వెళ్తున్న నరేందర్ రెడ్డి ప్రమాదంలో గాయపడ్డ మొలంగూర్ గ్రామానికి చెందిన దండు కొమురయ్యను, డానియల్ ను తన సొంత వాహనంలో హుటాహుటిన హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నాడు. కొమురయ్య నడుపుతున్న మోటార్ సైకిల్ ను పెద్దపల్లి నుండి వరంగల్ వైపు వెళ్తున్న డానియాల్ అనే వ్యక్తి రాయల్ ఇన్ ఫీల్డ్ వాహనంతో బలంగా ఢీకొట్టాడు. వివరాల్లోకి వెళితే.. శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామానికి చెందిన దండు కొమురయ్య(55) మొలంగూరు నుండి హుజురాబాద్ కు వెళుతుండగా మార్గమధ్యలో మొలంగూర్ పెట్రోల్ బంకు ఎదురుగా రాజీవ్ రహదారి పైన పెద్దపల్లి నుండి వరంగల్ వెళుతున్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ డేనియల్ దండు కొమురయ్య బైకును వెనుక నుండి ఢీకొనడంతో దండు కొమురయ్య తలకు మరియు కుడి కాలుకు దెబ్బ తగలడంతో ఒక్కసారిగా కింద పడడంతో కరీంనగర్ నుండి వర్ధన్నపేటకు వెళ్తున్న నరేందర్ రెడ్డి , క్షతగాత్రులను హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కళ్ళ ఎదుట జరిగిన ప్రమాదాన్ని తట్టుకోలేక తక్షణమే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన నరేందర్ రెడ్డిని స్థానికులు, పలువురు అభినందనలు తెలిపారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!