Social 1080×1350 • Multi-page
17-03-2025 BREAKING NEWS 11:27 PM
swarnodayam.com
Telugu Daily News

క్రైమ్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన జనార్దన్

క్రైమ్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన జనార్దన్
IMG_20250317_232354

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్ డీసీపీగా బెదరకోట జనార్ధన్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. 1989 ఎస్ఐ బ్యాచ్ కు చెందిన జనార్ధన్ వరంగల్, ఖమ్మం, సీఐడీ విభాగాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్లో అదనపు ఎస్పీగా పని చేస్తున్న జనార్దన్ ను డీసీపీగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రైమ్స్ డీసీపీగా నియామకమయి సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు పోలీసు అధికారులు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!