18-03-2025 NORMAL NEWS 12:17 PM
swarnodayam.com
Telugu Daily News
18-03-2025 12:17 PM By Mandala Yadagiri

ఓసీల్లో ఆర్ధికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకం వర్తింపజేయాలి.. -ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.

ఓసీల్లో ఆర్ధికంగా వెనుకబడిన ఈడబ్ల్యూఎస్ నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాస్ పథకం వర్తింపజేయాలి.. -ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు.
IMG-20250318-WA0086

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: రాజీవ్ యువ వికాస్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల నిరుద్యోగ యువతకు ఆయా కార్పొరేషన్ల ద్వారా అందించే ఆర్థిక సహాయాన్ని ఆర్ధికంగా వెనుకబడిన ఓసీ సామాజిక ఈడబ్ల్యూఎస్ వర్గాల నిరుద్యోగ యువతకు కూడా వర్తింపజేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య ఐకాస జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు. మంగళవారం కరీంనగర్ లోని సమాఖ్య కార్యాలయంలో ఐకాస నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో రామారావు మాట్లాడారు. ఓసీల్లోనీ పేదలకు ఆర్థిక, సంక్షేమ చేయూత నిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓసీల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు విది విధానాలను పాలక మండలిని ఇప్పటి వరకు ప్రకటించక కాలయాపన చేస్తూ ఓసీలను మనోవేదనకు గురి చేయడం సరికాదన్నారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు, ఆర్థిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం హర్షణీయమే అయినప్పటికీ ఈ పథకం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో పాటు ఆర్ధికంగా వెనుకబడిన ఓసీ సామాజిక వర్గాల ఈడబ్ల్యూఎస్ నిరుద్యోగ యువతకు వర్తింప జేసి సామాజిక సమన్యాయం జరపాలని పోలాడి రామారావు ప్రభుత్వ పాలకులకు విజ్ఞప్తి చేశారు.
తాము ఎవరికీ వ్యతిరేకం కాదని ఆర్ధికంగా వెనుకబడిన అన్ని వర్గాల పేదలకు స్వయం ఉపాధి, సంక్షేమ ఫలాలు అందాలన్నదే తమ ధ్యేయమన్నారు. ఈ సమావేశంలో పోలాడి రామారావుతో పాటు ఐకాస నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి, జున్నూతుల రాజిరెడ్డి, గూడూరి స్వామిరెడ్డి, ముసిపట్ల తిరుపతిరెడ్డి, నల్లా కొండాల్ రెడ్డి, ఎక్కేటి సంజీవరెడ్డి, తాటిపల్లి రాజన్న, ముచ్ఛా సమ్మిరెడ్డి, ఎర్రబెల్లి సంపత్ రావు, విష్ణుదాసు గోపాల్ రావు, కంకణాల సరోజనా జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Oplus_131072సమాఖ్య కార్యాలయంలో ఐకాస నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న పోలాడి రామారావు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!