Social 1080×1350 • Multi-page
18-03-2025 BREAKING NEWS 05:21 PM
swarnodayam.com
Telugu Daily News

బీసీ ఆజాది ఫెడరేషన్ నిర్విరామ పోరాట ఫలితమే బీసీ బిల్.. బీసీ బిల్ పట్ల ధన్యవాదాలు..-పార్లమెంట్ లో ఆమోదించి, 9వ షెడ్యూల్ లో చేర్చాలి. – ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుడికాల భాస్కర్

బీసీ ఆజాది ఫెడరేషన్ నిర్విరామ పోరాట ఫలితమే బీసీ బిల్.. బీసీ బిల్ పట్ల ధన్యవాదాలు..-పార్లమెంట్ లో ఆమోదించి, 9వ షెడ్యూల్ లో చేర్చాలి. – ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుడికాల భాస్కర్
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: బీసీ రిజర్వేషన్ల పెంచుతూ చట్టం చేసిన రాష్ట్ర ప్రభుట్వానికి, బిల్లుకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలకు ధన్యవాదాల తెలుపు తున్నమని బీసీ ఆజాది ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షులు కుడికాల భాస్కర్ అన్నారు. ఈరోజు హుజురాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని గత ఏడాదిన్నర కాలంగా బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిర్విరామ పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కులగనణ చేపట్టి, బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ల కోసం బీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. బిల్లు ఆమోదానికి సహకరించిన ప్రతి పార్టీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించకుండా పార్లమెంట్లో ఈ బిల్లును ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించి బీసీలకు మేమెంతో మాకంత వాటాను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్త కుల గణన, తెలంగాణ రాష్ట్ర బీసీ బిల్ ఆమోదం కోసం ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. గతంలో బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ చేపట్టిన ఆమరణ దీక్ష కార్యక్రమం వలన ఒత్తిడి జరిగి రాష్ట్ర ప్రభుత్వం కుల గణనను చేపట్టిందని, బీసీ ఆజాది ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్విరామ నీరసల కార్యక్రమాల వలన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీసీ కమిషన్ ఏర్పాటు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా బీసీకి అవకాశం ఇవ్వడం, బిఆర్ఎస్ పార్టీ శాసనమండలి ప్రతిపక్షనేతగా బిసీకి అవకాశం ఇవ్వడం, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల్లో బీసీలకు అవకాశాలు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు.

విరోచిత పోరాటంతో ప్రాణ త్యాగానికి సిద్ధపడి ఆమరణ దీక్ష చేసి ప్రభుత్వాన్ని కదిలించి నేడు బీసీ బిల్ కు కారకుడైన బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ ఉద్యమ స్ఫూర్తికి యువ్వాతు బీసీల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. జాతీయ స్థాయి కుల గణన, పార్లమెంట్లో బీసీ బిల్ ఆమోదం కోసం ఈ నెల 25 నుంచి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేపట్టబోతున్నట్లు కేంద్రంలో అధికారంలో బిజెపి పార్టీ వెంటనే బీసీలకు న్యాయం చేయడానికి చర్యలు చేపట్టాలని కోరారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!