Social 1080×1350 • Multi-page
18-03-2025 BREAKING NEWS 06:23 PM
swarnodayam.com
Telugu Daily News

ఎస్సీ వర్గీకరణతో ఉద్యోగాలు భర్తీ చేస్తేనే వర్గీకరణకు సార్థకత.

ఎస్సీ వర్గీకరణతో ఉద్యోగాలు భర్తీ చేస్తేనే వర్గీకరణకు సార్థకత.
Oplus_131072

–రుద్రారపు రామచంద్రం డిమాండ్ ……….

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ప్రస్తుతం తెలంగాణలో భర్తీ చేస్తున్న గ్రూప్ 1,2,3, హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలలో ఎస్సీ వర్గీకరణ తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హుజురాబాద్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షలు జరుగుతున్నాయి. ఈ దీక్షలో కూర్చున్న రుద్రారపు రామచంద్రం మాట్లాడుతూ ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలు అన్ని ఉప కులాలకు సమానంగా దక్కినప్పుడే రిజర్వేషన్ల సార్ధకత చేకూరుతుందని దాని కొనసాగింపుగానే మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్ళుగా ఎస్సి వర్గీకరణ న్యాయమైన పోరాటం జరిగిందని పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు వర్గీకరణను సమర్థిస్తూ ఇచ్చిన తీర్పులో రాష్ట్రాలకు అధికారాన్ని కట్టబెట్టింది. ఈ తీర్పు ఆధారంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ ఫలాలు అందించుటకు చట్టాలు ఏర్పడుతున్నాయి. అయితే ఒకపక్క చట్టాలు చేస్తూనే మరో ప్రక్క తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయడం అనేది కుట్రతో కూడిన అంశమని దీనివల్ల ఉమ్మడి రిజర్వేషన్లలో లబ్ధి పొందిన కులాలే మళ్లీ లబ్ధి పొందే ప్రమాదం ఉందని వివరించారు. ఆంధ్రప్రదేష్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీకరణ వచ్చేంతవరకు ఎటువంటి నోటిఫికేషన్లు ప్రకటించమని చెప్పటం పట్ల హర్ష వ్యక్తం చేశారు. కావున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చట్టం వచ్చిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపడితే షెడ్యూల్ కులాల అభ్యర్థులకు ఎవరి వాటా ప్రకారం వారికి అవకాశాలు వస్తాయని గుర్తు చేశారు. దీక్షలో ఎంఎస్పి జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, బొరగాల సారయ్య, దేవునూరి రవీందర్, మిడిదొడ్డి సమ్మయ్య కూర్చున్నారు. ఈ దీక్షకు సంఘీభావం ప్రకటించిన వారు యునైటెడ్ ఆర్టిఐ జిల్లా కన్వీనర్ గూడూరు స్వామిరెడ్డి, మరియు కంకణాల జనార్దన్ రెడ్డి, బండ లక్ష్మారెడ్డి, బొక్కల కృష్ణారెడ్డి ఉన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!