19-03-2025 NORMAL NEWS 09:58 AM
swarnodayam.com
Telugu Daily News
19-03-2025 09:58 AM By Mandala Yadagiri

హుజురాబాద్ గ్రంథాలయమును సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితేల ప్రణవ్…

హుజురాబాద్ గ్రంథాలయమును సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితేల ప్రణవ్…
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణం లోని గ్రంథాలయంను సందర్శించి విద్యార్థులు మరియు పాఠకులతో ముచ్చటించి గ్రంథాలయంలో ఉన్న సదుపాయాల గురించి తెలుసుకున్నారు. రాబోవు సంవత్సర కాలంలో రోజుకు 100 మంది విద్యార్థులు గ్రంథాలయానికి వచ్చి చదువుకునేల అభివృద్ధి చేస్తామని తెలిపారు. పోటీ పరీక్షలకు అనుగుణంగా పుస్తకాలు పొందుపరచాలని అలాగే గ్రంథాలయమును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి వారికి ప్రశాంత వాతావరణాన్ని కల్పించి అక్కడకు వచ్చే పాఠకులకు విద్యార్థులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని గ్రంథాలయానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించారు. రాబోయే రోజులలో నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ బాబు గారి సహకారంతో ఎస్ డిఎఫ్ నిధుల ద్వారా కొత్త భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. కొత్త భవనానికి అనుగుణంగా స్థలమును వదిలేసి టాయిలెట్స్ నిర్మించాలని అక్కడే ఉన్న మునిసిపల్ కమిషనర్ సమయ్యను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక లైబ్రరీయన్ కనకలక్ష్మి, గ్రంథ పాఠకులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఉన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!