Social 1080×1350 • Multi-page
19-03-2025 BREAKING NEWS 04:43 PM
swarnodayam.com
Telugu Daily News

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం

ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మాదిగల సూర్యుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ సారథ్యంలో మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ సాధన కోసం 30 ఏళ్ళుగా విరామం లేకుండా అకుంఠిత దీక్షతో, మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగిన వర్గీకరణ ఉద్యమం ఫలితంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో మంగళవారం అన్ని రాజకీయ పార్టీలు సంపూర్ణంగా మద్దతు తెలపటం వల్ల ఏకగ్రీవంగా ఆమోదం పొందిన సందర్భంగా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మరియు మాదిగ జాతి నాయకులు సంతోషం తో బాణసంచా పేల్చి మంద కృష్ణమాదిగ చిత్ర పటానికి పాలాబిషేకం చేశారు. అందరికీ స్వీట్లు పంచారు, ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ మంద కృష్ణ మాదిగ తన జాతి కోసం జీవితాన్ని త్యాగం చేసి 30 ఏళ్ళుగా నిరంతరం మాదిగలను చైతన్యం చేస్తూ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపినందుకు మాదిగ జాతి మొత్తం మంద కృష్ణ మాదిగకు రుణపడి ఉంటుందని అన్నారు. ఈ విజయాన్ని దండోరా ఉద్యమం లో అసువులు బాసిన మాదిగ అమర వీరులకు అంకితం ఇస్తున్నామని తెలిపారు. అసెంబ్లీలో మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు, 30 ఏళ్ళుగా ఉద్యమానికి సహకారం అందించిన అన్ని వర్గాల ప్రజలకు, ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉద్యమం లో పాల్గొన్న ఎమ్మార్పీఎస్ నాయకులకు , కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జాతీయ నాయకులు రుద్రారపు రామచంద్రం, రాష్ట నాయకుడు మారేపల్లి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు తునికి వసంత్, నియోజక వర్గ ఇన్ ఛార్జ్ తుంగ ఆంజనేయులు, ఎంఈఫ్ నాయకులు కలవల మల్లయ్య, బొడ్డు ఐలయ్య, ఇల్లందుల సమ్మయ్య, బొరగాల సారయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు తునికి సమ్మయ్య, మొలుగూరి ప్రభాకర్, పొడిశెట్టి వెంకట రాజం, బొడ్డు సంజీవ్,బొరగాల రాజ్ కుమార్, ఎర్ర శ్రీధర్, అందాసి నారాయణ, దేవునూరి రవీందర్, మోరే సతీష్, మొలుగు శ్రీనివాస్ , ఎల్కపల్లి సమ్మయ్య, బత్తుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Oplus_131072 మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు..
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!