Social 1080×1350 • Multi-page
19-03-2025 BREAKING NEWS 09:05 PM
swarnodayam.com
Telugu Daily News

విద్యారంగాన్ని విస్మరించిన రాష్ట్ర బడ్జెట్.. – బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంజాల రేవంత్.

విద్యారంగాన్ని విస్మరించిన రాష్ట్ర బడ్జెట్.. – బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంజాల రేవంత్.
IMG-20250319-WA0089

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ మార్చి 19:
2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విద్యార్థి సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మొత్తం ₹3,04,965 కోట్లు ఉన్న రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం ₹23,108 కోట్లు (7.57%) కేటాయించడాన్ని బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంజాల రేవంత్ తీవ్రంగా తప్పుబట్టారు.”ఎన్నికల మేనిఫెస్టోలో 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చాక ఆ మాటను మరిచిపోయింది. ఈ బడ్జెట్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. వెంటనే బడ్జెట్‌ను సవరించి విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించాలి” అని ఆయన డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే సరిపడా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ విద్యాసంస్థలు క్షీణిస్తుండటాన్ని ఆయన ఆగ్రహంతో విమర్శించారు. “ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి నోచుకోదా?” అంటూ ప్రశ్నించారు.విద్యారంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా ప్రభుత్వ విధానం మారుతుందని బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ హెచ్చరిస్తుందన్నారు. బడ్జెట్‌పై తమ నిరసనను రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తం చేయడానికి త్వరలో పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని రేవంత్ ప్రకటించారు.

బీసీ అజాది స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంజాల రేవంత్.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!