19-03-2025 NORMAL NEWS 11:07 PM
swarnodayam.com
Telugu Daily News
19-03-2025 11:07 PM By Mandala Yadagiri

జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్లను, సిబ్బందిని అభినందించిన కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్..

జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్లను, సిబ్బందిని అభినందించిన కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్..
IMG_20250319_230244

తెలంగాణ రాష్ట్రంలో ఆస్తి పన్ను 100 శాతం వసూలు చేసి మొదటి స్థానం సాధించిన జమ్మికుంట మున్సిపాలిటీ

రెండో స్థానం సాధించిన హుజురాబాద్ మున్సిపాలిటీ.

కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మరో రికార్డు.

ఇదే పంథాను పథకాల అమలు, సంక్షేమ పథకాల్లో కొనసాగించాలని కోరిన వోడితల ప్రణవ్..

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపాలిటీలు మరో రికార్డును సొంతం చేసుకున్నాయి. ఆస్తి పన్నుల వసూలు విషయంలో జమ్మికుంటకు మొదటి స్థానం రాగా, హుజురాబాద్ కు రెండవ స్థానం వచ్చింది. దీనిపట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ జమ్మికుంట, హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్లను అదేవిధంగా మున్సిపల్ సిబ్బందిని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల విషయంలో ఇదే పంథాను కొనసాగిస్తూ సంక్షేమం విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి జవాబుదారీతనంగా ఉంటూ మరింత భాద్యతగా ఉండాలని కోరారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని, దాని కోసం ఇప్పటినుండే ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను కోరారు.

Oplus_131072

మున్సిపల్ కమిషనర్లకు అభినందనలు తెలుపుతున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితెల ప్రణవ్.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!