Telugu Daily News
కాకతీయ కాలువలో లభించిన మృతుడి ఆచూకీ లభ్యం!… డిగ్రీ చదువుతున్న అరవింద్ గా గుర్తింపు. ఈనెల 19న ఈతకు వెళ్లి కాలువలో గల్లంతైన యువకుడు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి కేసి కెనాల్ లో కొట్టుకొని వచ్చిన గుర్తు తెలియని శవం ఆచూకీ లభించింది.
మృతుడు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన వాసాల అరవింద్ (21 )గా గుర్తించిన పోలీసులు. అరవింద్ కరీంనగర్ ఎస్సారార్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా ఈ నెల 19న స్నేహితులతో కలిసి ఎల్ ఏండిలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్దకు ఈత కోసం వెళ్లి గల్లంతైనట్లు ఎల్ఎండి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తుమ్మనపల్లి వద్ద లభించిన అరవింద్ మృతదేహాన్ని బయటికి తీసి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి పోలీసులు తరలించారు.



