21-03-2025 NORMAL NEWS 04:04 PM
swarnodayam.com
Telugu Daily News
21-03-2025 04:04 PM By Mandala Yadagiri

ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్తలు వహించాలి..డాక్టర్ శ్రీకర్

ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరమైన విషయంలో జాగ్రత్తలు వహించాలి..డాక్టర్ శ్రీకర్
IMG-20250321-WA0086

శ్రీరామ ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన….

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎండి జనరల్ ఫిజీషియన్, డయోబెటాలజిస్ట్ డాక్టర్ మోడెపు శ్రీకర్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పురపాలక సంఘం కమిషనర్ కేంసారపు సమ్మయ్య, శ్రీరామ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన శ్రీరామ ఉచిత వైద్య శిబిరానికి భారీ స్పందన వచ్చింది. ఈ శిబిరానికి మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, కార్మికులతో పాటు హుజురాబాద్ లోని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉచిత వైద్య శిబిరంలో వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ముఖ్యంగా వేసవి కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలాంటి అవసరాలున్న ఉదయం 10 గంటల లోపే ముగించు కోవాలన్నారు. ఎండాకాలంలో నీళ్లతో పాటు వివిధ రకాల పండ్ల రసాలను తీసుకుంటే మంచిదన్నారు. నేటి సమాజంలో చాలామంది డయాబెటిస్తో బాధపడుతున్నారని, షుగర్ వ్యాధి గ్రస్తులు తప్పకుండా షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవాలని అన్నారు. షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగితే ఇతర వ్యాధులు అధికంగా వచ్చే అవకాశం ఉంటుందని, ప్రతి నెలకోసారి షుగర్ పరీక్షలు చేయించుకుంటే వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, శ్రీరామ ఆస్పత్రి యాజమాన్యం నంబి భరణికుమార్, ముష్కే శ్రీనివాస్, పూరి, ఆసుపత్రి సిబ్బంది సతీష్, తిరుపతి, సునీత, ఐశ్వర్య, అంజలి, శిరీష, సంధ్య, దీపిక తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072 వైద్య పరీక్షలు చేస్తున్న డాక్టర్ శ్రీకర్
Oplus_131072 ప్రజలకు రక్త మూత్ర పరీక్షలతో పాటు బిపి చెకప్ చేస్తున్న వైద్య సిబ్బంది.
Oplus_131072 వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!