21-03-2025 NORMAL NEWS 04:40 PM
swarnodayam.com
Telugu Daily News
21-03-2025 04:40 PM By Mandala Yadagiri

ఘనంగా అంకుస్ పల్లి, రెడ్డిపల్లి-2 సెంటర్ లలో ఫ్రీ స్కూల్ మేళ…

ఘనంగా అంకుస్ పల్లి, రెడ్డిపల్లి-2 సెంటర్ లలో ఫ్రీ స్కూల్ మేళ…
IMG-20250321-WA0106

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, (వీణవంక) మార్చి 21: వీణవంక మండలంలోని అంకుస్ పల్లి, రెడ్డిపల్లి -2 అంగన్వాడి సెంటర్లలో శుక్రవారం ఫ్రీ స్కూల్ మేళ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టీచర్లు సరిత, వినోదలు మాట్లాడుతూ.. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, అంగన్వాడి ప్రీ స్కూల్ పిల్లల (3 నుండి 6 సంవత్సరాలు)అభివృద్ధికై అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, పుట్టిన బిడ్డ నుండి ఆరు సంవత్సరాల పిల్లల వరకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచిత పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. అలాగే గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు పోషకాహార లోపం లేకుండా గుడ్లు, పాలు, బాలామృతం, పోషక విలువలు కలిగిన భోజనం, కురుకురేలు అందిస్తూ, ఆరోగ్యవంతులుగా మారుస్తున్నామని తెలిపారు. ప్రీస్కూల్ పిల్లలకు స్కూల్ యూనిఫామ్ ఇవ్వడం జరిగిందని, ప్రత్యేకించి ప్రీస్కూల్ పిల్లలకు అసెస్మెంట్ కార్డులను ఇవ్వడం జరుగుతుందన్నారు. అంగన్వాడి కేంద్రాలలో పిల్లలందరూ చురుకుగా తయారయ్యారని, పిల్లల్లో పోషకాహార నివారణకు అంగన్వాడీ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. అనారోగ్య సమస్యలకు కూడా ఆర్ బిఎస్ కే వారి సహకారంతో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అంగన్వాడి కేంద్రాలు గర్భిణీలకు, బాలింతలకు, ప్రీస్కూల్ పిల్లలకు వరంగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, ఆయా సెంటర్ల ప్రీస్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!