Social 1080×1350 • Multi-page
21-03-2025 BREAKING NEWS 05:57 PM
swarnodayam.com
Telugu Daily News

రెండు రోజుల క్రీడా సాహిత్య సాంస్కృతిక సాంకేతిక ఉత్సవము కిట్సోజన్ 25 ముగింపు.. – ఉజ్వల భవిష్యత్తుకై మీ కలలను సాకారం చేసుకోండి : ఏసిపి శ్రీనివాస్ జి, – విద్యార్థికి క్రమశిక్షణ శ్రీరామరక్ష: మాజీ ఎంపీ కెప్టెన్

రెండు రోజుల క్రీడా సాహిత్య సాంస్కృతిక సాంకేతిక ఉత్సవము కిట్సోజన్ 25 ముగింపు.. – ఉజ్వల భవిష్యత్తుకై మీ కలలను సాకారం చేసుకోండి : ఏసిపి శ్రీనివాస్ జి, – విద్యార్థికి క్రమశిక్షణ శ్రీరామరక్ష: మాజీ ఎంపీ కెప్టెన్
IMG_20250321_174846

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: విద్యార్థులు తాము చదువుకుంటున్నప్పుడే ఉత్తమ క్రమశిక్షణను అంకితభావమును అలవాటు చేసుకోవాలని హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి అన్నారు. ఈరోజు డైరెక్టర్ డాక్టర్ కే శంకర్ అధ్యక్షతన జరిగిన కిట్సోజన్ 25 ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి శ్రీనివాస్ జీ ప్రసంగిస్తూ వివిధ విషయాలను చర్చించారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే ఒక వ్యక్తి యొక్క పరిపూర్ణ వికాసము, పూర్ణ వ్యక్తిత్వము కలుగుతుందని అందువలన విద్యార్థి ఎంతో క్రమశిక్షణతో ఉండాలని చదువులో అంకితభావం కలిగి ఉండాలని, తల్లిదండ్రుల పట్ల, తోటి విద్యార్థుల పట్ల సమాజం పట్ల వినయ విధేయతలు కలిగి ఉండాలని అన్నారు. మారుతున్న సాంకేతిక సమాజంలో కంప్యూటర్ ఇంటర్నెట్ మొబైలు మొదలగు సాధనంల వలన విద్యార్థులు తమ విలువైన సమయాన్ని కోల్పోయి చదువులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. విద్యార్థి అతను తమ యొక్క జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకొని తద ను గుణముగా కష్టపడాలని చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్థులు కొత్త పరికరాలను కనుగొని మానవ జీవితంలో మరింత సుఖమంతం చేయాలని అన్నారు. ఇతర నేరాలతో పాటు ప్రస్తుతము సమాజంలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతున్నదని సైబర్ నేరాల బారిన ఉన్నత విద్యావంతులు కూడా బలి అవుతున్నారని అందువలన విద్యార్థులు కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం కనుగొని సైబర్ నేరాలను అరికట్టే విధముగా కృషి చేయాలని సమాజానికి అవసరమైన కొత్త కొత్త కంప్యూటర్ అప్లికేషన్లను కనుగొనాలని అన్నారు. విద్యార్థులు మత్తు పానీయాలకు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని హెచ్చరించారు. కళాశాల చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వి .లక్ష్మి కాంతారావు మాట్లాడుతూ సాంకేతిక విద్యార్థులు విషయ పరిజ్ఞానంతో పాటు కమ్యూనికేషన్స్ స్కిల్స్ టెక్నికల్ స్కిల్స్ నేర్చుకొని సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులు చేయాలని అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ కే శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు తాము చదువుతున్న విషయపరిజ్ఞానమును ఆచరణలో పెట్టినచో సమాజానికి ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టు చేయవచ్చని విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని వృధాగా పోనీయద్దని విద్యార్థి యొక్క సమయము చాలా విలువైనదని అన్నారు .కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే ఈశ్వరయ్య మాట్లాడుతూ సాంకేతిక విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానమును, తమ సాంప్రదాయమును, ఐక్యతను కాపాడుకొనుటను ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలని, వాటిని మరిచిపోవద్దని, సమాజమునకు మంచి చేయుటకు ఉపయోగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్, ఈ ఉత్సవ అధ్యాపక సమన్వయకర్తలు డాక్టర్ సునీత, అధ్యాపకుడు రాజు, విద్యార్థి సమన్వయకర్తలు అభిరామ్, సింధుజ, ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, కళాశాల డైరెక్టర్ డాక్టర్ కే శంకర్, ప్రి న్సిపాల్ డాక్టర్ కే ఈశ్వరయ్య, కళాశాల వివిధ విభాగాల అధిపతులు, వివిధ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశ అనంతరము ఈ ఉత్సవములో వివిధ పోటీలలో గెలుపొందిన వివిధ కళాశాలల విద్యార్థిని విద్యార్థులకు జ్ఞాపికలను ప్రశంసా పత్రాలను అందజేశారు. ఏసీపీ శ్రీనివాస్ జీ ని సన్మానించారు.


Oplus_131072 ముగింపు సమావేశంలో మాట్లాడుతున్న ఏసిపి శ్రీనివాస్ జి..

Oplus_131072
Oplus_131072

కార్యక్రమంలో మాట్లాడుతున్న కిట్స్ చైర్మన్, మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు..

Oplus_131072

కిడ్స్ డైరెక్టర్ శంకర్

Oplus_131072

విజేతలకు బహుమతులు అందజేస్తున్న ఏసిపి..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!