Social 1080×1350 • Multi-page
21-03-2025 BREAKING NEWS 06:18 PM
swarnodayam.com
Telugu Daily News

మహనీయుల జయంతి కమిటీల ఎన్నికలు మార్చ్ 23 న

మహనీయుల జయంతి కమిటీల ఎన్నికలు మార్చ్ 23 న
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పార్క్ లో మహనీయుల జయంతి కమిటీల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. మహాత్మ జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతి కమిటీల ఎన్నికలు మార్చ్ 23 ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల మద్య హుజురాబాద్ లోని సాయిరూప ఫంక్షన్ హాల్ లో జరుగుతుంది. హుజురాబాద్ లో ఉన్న పూలే అంబేడ్కర్ వాదులు, బీసీ ఎస్సీ ఎస్టీ, మైనారిటీ నాయకులు, వివిధ ప్రజా, కుల సంఘాల నాయకులు, ఉద్యోగులు, మహిళలు అందరూ హాజరై జయప్రదం చేయగలరని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో ప్రస్తుత జ్యోతిరావు పూలే జయంతి కమిటీ చైర్మన్ ఉప్పు శ్రీనివాస్, అంబేద్కర్ జయంతి కమిటీ చైర్మన్ మహమ్మద్ ఖాలీక్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి, ఇల్లందుల సమ్మయ్య, బాబు జగ్జీవన్ రామ్ జయంతి కమిటీ చైర్మన్ రొంటాల సుమన్, కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు, తునికి సమ్మయ్య, ఎర్ర శ్రీధర్, బత్తుల రాజలింగం, బొరగాల సారయ్య, డాక్టర్ తడికమళ్ళ శేఖర్, రామ్ రాజేశ్వర్, తూముల కుమార్, ఆకునూరి అచ్యుత్, ఎర్ర రాజ్ కుమార్, చాట అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!