Social 1080×1350 • Multi-page
21-03-2025 BREAKING NEWS 07:11 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు

ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు
IMG_20250321_190943

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైన పదవ తరగతి వార్షిక పరీక్షలు హుజురాబాద్ డివిజన్ లో ప్రశాంతంగా జరిగాయి. హుజురాబాద్ మండలంలో 10వ తరగతి వార్షిక పరీక్షలు వ్రాసే విద్యార్థుల కోసం నాలుగు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హుజురాబాద్ పట్టణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరీ బాలుర పాఠశాల తో పాటు చెల్పూర్ లోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల లు పరీక్ష కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. 815 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను ఇద్దరు విద్యార్థులు గైరాజరైనట్లు, నలుగురు ప్రైవేటు విద్యార్థులకు ఒక విద్యార్థి పరీక్షకు గైరాజరైనట్లు హుజూరాబాద్ ఎంఈఓ భూపతి శ్రీనివాస్ తెలిపారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా జరగడం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి సెంటర్లో సిట్టింగ్ స్క్వాడ్ ప్రభుత్వము నియమించిందన్నారు. దీనికి తోడు పోలీస్ శాఖ ప్రతి సెంటర్ వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటుచేసి పరీక్షలు సక్రమంగా జరిగే విధంగా చూశారు.

Oplus_131072
Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!