Social 1080×1350 • Multi-page
22-03-2025 BREAKING NEWS 12:05 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్‌ యువతి లవని ప్రియకు పీఠాధిపతి చేతుల మీదుగా ప్రశంస పత్రం

హుజురాబాద్‌ యువతి లవని ప్రియకు పీఠాధిపతి చేతుల మీదుగా ప్రశంస పత్రం
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మార్చ్22 :కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌ సీనియర్ పాత్రికేయుడు నిమ్మటూరి సాయికృష్ణ కుమార్తె లవనిప్రియ తన నృత్య నైపుణ్యంను ప్రదర్శించి ప్రత్యేక గుర్తింపు పొందింది. నృత్య అకాడమీ టీచర్ శ్రీనిధి ఆధ్వర్యంలో 21వ తేదీ నాడు రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం బాసర సరస్వతి కళ్యాణ మండపంలో నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలో అద్వితీయంగా రాణించిన ఆమెను ప్రముఖ తోగుట పీఠాధిపతి శ్రీ శ్రీశ్రీ మాధవ నంద సరస్వతీ స్వామి వారి చేతుల మీదుగా ఘనంగా సత్కరించి ప్రతిభకు తగిన ప్రోత్సాహంగా ప్రశంసా పత్రాన్ని లవని ప్రియకు అందించారు. భవిష్యత్తులో మరింతగా రాణించి మరెన్నో విజయాలు సాధించాలని స్వామిజీ ఆశీర్వదించారు. ఆమె ప్రతిభకు కుటుంబ సభ్యులు, గురువులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు. నృత్య ప్రపంచంలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అభిలాషిస్తున్న లవని ప్రియ, తన సాధనను కొనసాగిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ప్రత్యేక గుర్తింపు పొందాలని పలువురు కోరుకుంటున్నారు.

Oplus_131072 తోగుట పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శ్రీ మాధవనంద సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకుంటున్న లవని ప్రియ.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!