Social 1080×1350 • Multi-page
22-03-2025 BREAKING NEWS 02:30 PM
swarnodayam.com
Telugu Daily News

ఈనెల 23 నుండి 30 వరకు “భగత్ సింగ్ వర్ధంతి” వారోత్సవాలను జయప్రదం చేయండి : – బొంతు ఆనంద్ “పివైఎల్” జిల్లా ఉపాధ్యక్షులు

ఈనెల 23 నుండి 30 వరకు “భగత్ సింగ్ వర్ధంతి” వారోత్సవాలను జయప్రదం చేయండి : – బొంతు ఆనంద్ “పివైఎల్” జిల్లా ఉపాధ్యక్షులు
IMG-20250322-WA0080(1)

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(రామగుండం): రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ “వర్ధంతి సభ” గోడ పత్రికలను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా “పివైఎల్” జిల్లా ఉపాధ్యక్షులు బొంతు ఆనంద్ మాట్లాడుతూ పివై ఎల్, పిడిఎస్ యు ల రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుక్ దేవ్ ల 94వ వర్ధంతి సభలను ఈనెల 23 నుండి 30 వరకు జిల్లా వ్యాప్తంగా జరపాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ముఖ్యంగా యువకులు, విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. అలాగే సామ్రాజ్యవాదానికి భారత విద్యార్థి నిరుద్యోగులపై ట్రంపు దురహంకారానికి వ్యతిరేకంగా మరియు బిజెపి మతోన్మాద పాపిష్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ ను తక్షణమే నిలిపివేయాలని, మోడీ బిజెపి ప్రభుత్వం యావత్ దేశ సంపదను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పే ప్రయత్నాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడినప్పుడు మాత్రమే భగత్ సింగ్ కు మనమందించే ఘనమైన నివాళి అని యువతకు పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు మేరుగు చంద్రయ్య, కొల్లూరి మల్లేష్, పైడిపల్లి రమేష్, పివైఎల్ రాష్ట్ర నాయకులు ఆర్మూర్ల తిరుపతి, జిల్లా మండల నాయకులు గొట్టే శంకర్, కలువల మహేందర్, కోడిపుంజుల పోచయ్య, లక్ష్మణ్, రాములు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072షాహిద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ “వర్ధంతి సభ” గోడ పత్రికలను ఆవిష్కరిస్తున్న నాయకులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!