Social 1080×1350 • Multi-page
22-03-2025 BREAKING NEWS 05:32 PM
swarnodayam.com
Telugu Daily News

నీటి వనరుల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత… -బాలవికాస ప్రతినిధి ఎండి కాజాభీ

నీటి వనరుల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత… -బాలవికాస ప్రతినిధి ఎండి కాజాభీ
IMG-20250322-WA0097

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: ప్రపంచ నేటి దినోత్సవం సందర్భంగా సకల జీవరాసుల మనుగడలో నీటి ప్రాముఖ్యతను మానవాళికి చాటి చెబుతూ నీటి వనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బాలవికాస ప్రతినిధి ఎండి కాజాభీ పేర్కొన్నారు. బాలవికాస సంస్థ ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీన గ్రామాల్లో పట్టణాల్లో అనేక అవగాహన కార్యక్రమాలను చేపడుతూ ప్రజలను భాగస్వాములుగా చేస్తూ విద్యార్థి దశ నుండే పిల్లల్లో నీటి సంరక్షణ బాధ్యత పెంచుతూ బావి భారత పౌరులుగా నీటి వనరుల సక్రమ నిర్వహణలో విద్యార్థులను చైతన్యవంతులను చేయడం జరుగుతుందన్నారు. పాఠశాలల్లో వాగ్పర్ వాటర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ఈ సంవత్సరం నీటి దినోత్సవంకి ఇతివృత్తంగా హిమ నాదాల పరిరక్షణ అనే అంశాన్ని ఎన్నుకొని హిమనాధాల పరిరక్షణలో భూమిని రక్షించుటలో పౌరుల బాధ్యతపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 14 జిల్లాలోని 40 పాఠశాలల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని మూడు పాఠశాలల్లో, మహారాష్ట్రలోని రెండు జిల్లాల్లోని రెండు గ్రామాల్లో, కర్ణాటకలోని ఒక జిల్లాలోని ఒక గ్రామంలో, గోవాలోని ఒక జిల్లాలోని ఒక పాఠశాల మొత్తంగా ఐదు రాష్ట్రాల్లోని 20 జిల్లాల్లో గల 47 పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కాజాభీ తెలిపారు. బాలవికాస సంస్థ గత 30 సంవత్సరాలుగా అనేక నీటి వలన సంరక్షణ కార్యక్రమాలను చేపడుతూ నీటి ప్రాముఖ్యతపై అన్ని వర్గాల్లో అవగాహన పెంచుతుందని, నీటి సంరక్షణ ధ్యేయంగా ర్యాలీలు మానవహారాలు నిర్వహిస్తుందని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడుకొని భావితరాల వారి కోసం నీటిని ఆదా చేయడమే వారికి మనమిచ్చే కానుకగా గుర్తుపెట్టుకోవాలన్నారు. మన ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకొని ప్రతి నీటి బొట్టును బంధించాలని అంతేకాక వర్షపు నీటిని భూమిలోకి ఇంకెలాగా ఏర్పాటు చేసుకొని భూగర్భ జలాలను పెంచి జల రక్షణ గావించాలన్నారు. అందుకోసం అందరం చేయి చేయి కలిపి జల రక్షణకై ముందుకు సాగుదామని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ గంగా మరియు ప్రధానోపాధ్యాయులు, గ్రామ మహిళలు, కో ఆర్డినేటర్స్ రజిత, కళ్యాణి, ఆకునూరి లింగయ్య, సత్తమ్మ, మహిళలు, విద్యార్థులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

నీటి సంరక్షణ పై ప్రతిజ్ఞ చేస్తున్న విద్యార్థులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!