Social 1080×1350 • Multi-page
23-03-2025 BREAKING NEWS 11:00 PM
swarnodayam.com
Telugu Daily News

కేంద్ర ప్రభుత్వ విధానాలతో తపాలా శాఖ ప్రైవేటీకరణ.. -8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి. -అఖిలభారత తపాలా ఉద్యోగుల సంఘం

కేంద్ర ప్రభుత్వ విధానాలతో తపాలా శాఖ ప్రైవేటీకరణ.. -8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలి. -అఖిలభారత తపాలా ఉద్యోగుల సంఘం
IMG-20250323-WA0201

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
అనాదిగా దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు సేవలు అందిస్తున్న తపాలా శాఖను కేంద్ర ప్రభుత్వం తన విధానాలతో ప్రైవేటీకరణ చేస్తుందని అఖిల భారత తపాలా శాఖ సంఘం నాయకులు గ్రూప్ సి అధ్యక్షులు యు. మహేందర్, కార్యదర్శి పి శ్రవణ్ కుమార్ ను అన్నారు. ఆదివారం హుజురాబాద్ పట్టణంలో అఖిలభారత తపాలా సంఘం గ్రూప్ C, పోస్టుమెన్, యంటి యెస్ ల ధ్వై వార్షిక సమావేశo జరిగాయి. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ,కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ తపాలా శాఖని ప్రయివేటీకరణ చేసే ప్రక్రియని వేగవంతం చేస్తుందన్నారు. తపాలా శాఖ ఒక్కటే కాకుండా ప్రభుత్వ సంస్థలను ప్రజలకి దూరం చేసి ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుందని అన్నారు. నిరంతరం ఉద్యోగుల శ్రేయస్సుకై పోరాడే NFPE సంఘ గుర్తింపుని నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేసి తపాలా సంస్థని 6 శాఖలుగా విచ్ఛిన్నం చేసిందని అన్నారు. ప్రస్తుత తరుణంలో తపాలా శాఖ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే కుట్రలు పన్నుతున్నారని, దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క సభ్యుడు కంకణబద్దులై మరింత ఉత్సాహంతో యూనియన్ కార్యకలాపాలలో పాల్గొనాలని కోరారు. 8వ వేతన సంఘాన్ని వెంటనే ఏర్పాటు చేయడం తో పాటు పాత పెన్షన్ విధానం(OPS) ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.

నూతన కార్యవర్గ ఏర్పాటు

తపాలా శాఖ P3 అధ్యక్షులు గా పోలు రవికుమార్, కార్యదర్శిగా జక్కు రజనీకాంత్ కోశాధికారిగా చిలుకమర్రి ప్రవీణ్ లు ఎన్నికయ్యారు P4 అధ్యక్షులుగా ఆకినపల్లి రంజిత్, కార్యదర్శిగా సంకటి హరీష్, కోశాధికారిగా ఆడేపు రవికుమార్ లు ఎన్నికయ్యారు. ఈ సమావేశం లో రిటైర్డ్ నాయకులు సమ్మయ్య, రామస్వామి, సాంబశివరెడ్డి, కొంరెల్లి ఉద్యోగులు ప్రభాకర్, రాజమౌళి, గోపికిషన్, చంద్రమోహన్, పత్తి అమర్నాథ్ రెడ్డి, ఆంజనేయులు, శ్రావణ్, వేణుగోపాల్, రాజ్ కుమార్, శ్రీనివాస్, రాజు, సత్యం, స్వామి, శివాజీ, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072 మాట్లాడుతున్న అఖిల భారత తపాలా శాఖ సంఘం నాయకుడు గ్రూప్ సి అధ్యక్షులు యు మహేందర్
Oplus_131072 మాట్లాడుతున్న కార్యదర్శి పి శ్రవణ్ కుమార్
Oplus_131072 నూతనంగా ఎన్నికైన కమిటీతో రాష్ట్ర నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!