26-03-2025 NORMAL NEWS 08:23 PM
swarnodayam.com
Telugu Daily News
26-03-2025 08:23 PM By Mandala Yadagiri

అంబేద్కర్ 134వజయంతి కమిటీ అధ్యక్షుడిగా మారేపల్లి శ్రీనివాస్ ఎన్నిక

అంబేద్కర్ 134వజయంతి కమిటీ అధ్యక్షుడిగా మారేపల్లి శ్రీనివాస్ ఎన్నిక
Oplus_131072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లో BSR గార్డెన్ లో అంబేద్కర్ 134వ జయంతి కమిటీ ఎన్నిక సమావేశం మాజీ జయంతి కమిటీ చైర్మన్ మహమ్మద్ కాలిక్ హుస్సేన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా, కుల సంఘాల నాయకులు అంబేద్కర్ వాదులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో 134 వ అంబేద్కర్ జయంతి కమిటీ అధ్యక్షుడిగా మారేపల్లి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా ఆలేటి రవీందర్ , రుద్రారపు రామచంద్రం, బొరగాల సారయ్య, డాక్టర్ తడికమళ్ళ శేఖర్ వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ గా ఎన్నికైన మారేపల్లి శ్రీనివాస్ ను ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మరియు ప్రజాసంఘాల నాయకులు సొల్లు బాబు, కొండ్ర నరేష్, కొలిపాక శంకర్, చందుపట్ల జనార్ధన్, వేల్పుల రత్నం, ఎర్ర రమేష్, తునికి సమ్మయ్య, తునికి వసంత్, ఎర్ర శ్రీధర్, రొంటాల రాజ్ కుమార్, ఉప్పు శ్రీనివాస్, రొంటాల సుమన్, వేముల పుష్పలత, సొల్లు సునీత, మొలుగు రాధ, ఎర్ర రాజ్ కుమార్, ఎర్ర నాగరాజు, మొలుగు శ్రీనివాస్, సందెల వెంకన్న, మట్టేడ ప్రకాష్, కలవల మల్లయ్య, మొలుగూరి ప్రభాకర్, రామ్ రాజేశ్వర్, బొడ్డు ఐలయ్య తదితరులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ జయంతోత్సవాన్ని ఘనంగా నిర్వహించి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రచారం చేయాలని ఆకాంక్షించారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!